Posted by: manikya on: నవంబరు 1, 2006
“ఉగాది” చిత్రానికి సిరివెన్నెల రాసిన ఒక పాట:
కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు
అవి నీ పైనే వాలేనేమో కొంచెం గమనించు
ఇప్పటి దాకా పరిచయమైనా లేకపోవచ్చు
అవి ఎప్పటినుంచో నీకోసమనీ చూస్తూ ఉండొచ్చు
నువు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరవచ్చు!!
అమ్మాయి కనులని “కాటుక పిట్టలుగా” వర్ణించడంలో ఎంత సౌందర్యం, ఎంత భావుకత! “రెప్పల రెక్కలు” చాచి ఆ పిట్ట ప్రియుడిపై వాలిందని అనడం లో ఎంత thought continuity. ఆహా అనిపించే భావం! సాహో అనరా విన్న జనం!!
Thanks for remembering the lines… I liked very much these lines.
సిరివెన్నెల గారికి “రెప్పలు”, “కన్నులు” మీద ఉన్న అభిమానం ఆయన పాటల్లో చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఆత్రేయ గాని మనసుకవి అన్నట్టు, ఈయనని తరవాతి తరాలు కంటికి సంబంధించిన ఏదో ఉపమానం తో గుర్తిస్తాయి అనే నా నమ్మకం!.
.
నవంబరు 1, 2006 వద్ద 4:38 అపరాహ్నం
WOW!! Once my dad pointed out the beauty of these lines. He liked the word “KaatukaPittalu”