బధ్రపరచినది సెప్టెంబరు , 2009

నీ ప్రశ్నలు నీవే!

ఉత్తమ సాహిత్యం ఎప్పుడూ పాఠకుడికి సూటిగా వెళ్తుంది, ఎవరి వ్యాఖ్యానం అవసరం లేకుండా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ గీతాలు ఈ కోవకే చెందుతాయి. అందుకే ఈ బ్లాగులో ఆయన పాటలపై వివరణలు తక్కువ కనిపిస్తాయ్. అయినా ఒక్కో సారి సిరివెన్నెల పాటలకీ వ్యాఖ్యానం అవసరం అవుతుంది. ఈ మధ్య కాలంలో నాకు ఇలా అనిపించిన పాట “నీ ప్రశ్నలు నీవే” (కొత్త బంగారు లోకం సినిమా). నిజానికి ఈ పాటలో అంత క్లిష్టత లేదు. చాలా వరకూ అర్థమైపోతూనే ఉంటుంది. అయినా కొంత వివరణ ఇద్దామని ఈ వ్యాసం.

ఈ పాట గురించి Orkut Sirivennela కూటమిలో లో మంచి చర్చ జరిగింది - Orkut – నీ ప్రశ్నలు నీవే . అందులో చాలా మంచి విశ్లేషణలు చేసి, ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ ఇచ్చిన వీరికి ముందుగా నా ధన్యవాదాలు: అన్న నచకి (పాట picturization గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు. అది పై లింకులో మీరు చదవొచ్చు), వెంకట్ గారు (కొన్ని విషయాలు సిరివెన్నెల గారినే అడిగి clarify చేశారు), శైలజ గారు (కొన్ని చక్కటి వివరణలు).

ప్రేమలో పడిన పడుచు జంట ఇంట్లో నుంచీ పారిపోదామని నిర్ణయించుకున్న సందర్భంలో వచ్చే background song  ఇది. దీనికి మాములుగా సాహిత్యం రాయడం కష్టం కాదు. అయితే decision making గురించీ, maturity గురించీ, జీవిత సత్యాల గురించీ చెప్పే పాటగా మలచాలంటే ఒక సిరివెన్నెల కావాలి. పాటల్లో పాఠాలు నేర్పే మేస్టారూ, మెగా స్టారూ ఆయనే కదా మరి.

failure

ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం రాయడానికి సరిపోయే విషయాలున్న ఈ పాటలోని పాఠాలని ఒక సారి పరికిద్దాం:
Take Responsibility
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
చాలా సమస్యల్లో క్లిష్టత నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. ఊరికే వదిలిస్తే సమస్యలు వాటంతట అవే తీరి పోతే బాగుండేది. కానీ చాలా సమస్యలు ఇలా దారికి రావు. కాబట్టి మనకున్న భయాలని, ఆందోళనలని పక్కన పెట్టి సమస్యని ఎదురుకోక తప్పదు. పక్కవాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు కానీ మనకేం కావాలో మనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే “తప్పించుకు పారిపోకు, ఆగిపోకు, నీ సమస్యని నువ్వే సాధించాలి” అని కర్తవ్య గీతను మరో శ్రీ కృస్ణుడై బోధిస్తున్నారు సిరివెన్నెల.
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
అమ్మైనా సరే సాధారణంగా తొమ్మిది నెలలు మోస్తుంది, మహా అయితే పది నెలలు. అంతే. తర్వాత నువ్వు అమ్మ నుండి విడిపడాల్సిందే. నీకు నువ్వుగా ఎదగాల్సిందే. అలాగే పూలకొమ్మ పూలని తనతోనే ఉంచుకోదు. గుడికో, జడకో పంపించి నీ పరిమళాన్ని నువ్వే పంచుకో, నీ పరమార్థాన్ని నువ్వే చేరుకో అని చెప్తుంది. సినిమా పరంగా చెప్పాలంటే యువ జంటకి – “మీరు చిన్న పిల్లలు కారు..ఎదిగిన వాళ్ళూ, తెలిసిన వాళ్ళు. మీరే తేల్చుకోండి”  అని హితబోధ చేస్తున్నరు సిరివెన్నెల.

Life is difficult

బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా

ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

జీవితం పూల బాట కాదు. ఇది తెలిసిందే అయినా, ప్రేమ మత్తులో పడిన పడుచు జంటకి గుర్తు చెయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మత్తులో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వాళ్ళ ముందు జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆచితూచి అడుగు వెయ్యమని బోధన.

Real intelligence is knowing how to use intelligence

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?

గతముందని గమనించని నడిరేయికి రేపుందా?

గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?

తెలివీ, తర్కం మనిషికున్న గొప్ప వరాలు. ఇవి Tools లాటివి. వాడాల్సిన చోట, వాడాల్సిన పద్ధతిలో వాడితే ప్రయోజనం పొందుతాం.  ”తర్కం అన్నది అన్ని వైపులా పదునున్న కత్తి. మనం ఎందుకు వాడుతున్నాం అనే ప్రశ్న మీద తర్కం యొక్క లక్ష్యం చేధించబడుతుంది” అని చెబుతూ సిరివెన్నెల తన ఒక పాత కవితలో ఇలా రాశారు -

తర్కం ఒక ఆట

ఒక కెలిడియోస్కోప్

మేధోమథనమే దాని లక్ష్యమైతే

తర్కం ఒక బాట

ఒక దూరదర్శిని

సత్యాన్వేషణే దాని లక్ష్యమైతే

తర్కాన్ని ఆటగా వాడడం అంటే మనకి నచ్చిన దానికి సమర్థనగా లాజిక్కులు తియ్యడం – “అలలు లేని కడలి లేదు, అలాగే అలజడి లేని మనసు లేదు. కలలు లేని కనులు లేవు.” అంటూ intermediate చదివే కురాడు తన ప్రేమని సమర్థించుకోవడం ఈ కోవకే చెందుతుంది. అందుకే వెలుగుని చూపే, గమ్యన్ని చేర్చే బాటగా  తర్కాన్ని వాడాలి అని సుతిమెత్తగా సూచిస్తున్నారు.

Define your success

వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.

గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?

Clarity అన్నది జీవితంలో చాలా ముఖ్యం. మనం ఏమి సాధించాలో తెలియకపోతే ప్రతి అల్పమైనదీ గెలుపులాగే అనిపిస్తుంది. వయసులో ఉన్న యువ జంటకి ప్రేమే గొప్ప గెలుపు అనిపిస్తుంది అది సుడిలో పడదోసే నావ అయినా సరే. అందుకే ఇక్కడ సిరివెన్నెల – “తెలివిని వాడండి. మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. తెలిసీ తప్పటడుగులు వెయ్యకండి” అని చెప్తున్నారు.

Lost moment is lost forever

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?

ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?

మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..

కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??

కాలం మనపై ప్రేమ కురిపిస్తూ, రోజూ గోరు ముద్దలుగా ఒకొక్క జీవిత సత్యాన్నీ తినిపిస్తూ కూర్చోదు. మనకే ఆ జాగ్రత్తా, స్పృహా, తెలివీ ఉండాలి. సినిమాలో హీరో తన తండ్రిని కోల్పోతాడు. కొంత పశ్చాత్తాపం కలుగుతుంది. సూర్యుడు ఉన్నప్పుడు అతని విలువని గ్రహించక రాత్రి అయ్యి చీకటి పడ్డాక తెలుసుకుంటే పెద్ద ప్రయోజనం లేదు. అయితే మళ్ళీ వెలుగు వస్తుంది కాబట్టి ఈ సారైనా తెలివి తెచ్చుకుని మసలడం చెయ్యాలి.

Learn from history

కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!

అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.

తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???

ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!!

గత చరిత్రనీ, మన అనుభవాలని ఒక సారి తరచి చూసుకోవడం అవసరం. ఎందుకంటే అవి మనం చేసిన తప్పుల్ని, మన అసమర్థతల్ని, మన సత్తాలనీ చూపెడతాయి కనుక. మనం ముందు వెయ్యబోయే అడుగులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంత వివరిస్తాయి కనుక. మనం చరిత్రని తిరగ రాయాలనుకున్నా కూడా ఇప్పటికే రాసి ఉన్న చరిత్రని చదవడం అవసరం! ఇది విస్మరించి ప్రపంచంలో మాదే ప్రత్యేకమైన ప్రేమ జంటా, మాది అమర ప్రేమ, లేక అద్భుత ప్రేమ అనే బ్రాంతిలో మునుగుతూ ఉంటే చివరికి మునకే మిగులుతుంది. ఒక్క సారి ప్రేమ పేరుతో పడదోసిన పాత కథలనీ, ప్రేమ వల్ల రగిలిన చితులని స్మరించుకుంటే ఇలా ముందు వెనకలు చూడకుండా ఉరికే వలపు పరుగులు కుదుట పడతాయ్. అప్పుడు  ప్రేమికుల జీవితాలూ, తల్లిదండ్రుల హృదయాలూ కూడా నవ్వుకుంటాయ్. కన్ను కొట్టే జాబిల్లీ, వెన్నెల రగిల్చే విరహాలూ, దోబూచులాడే చుక్కలూ…వీటిని అన్నింటినీ కూడా అప్పుడు దర్జాగా అనుభూతి చెందొచ్చు!!

వ్యాఖ్యలు (40)

విన్నవీ నచ్చినవీ – గణేష్

స్రవంతి మూవీస్ నుంచి వస్తున్న ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్. మొత్తం సిరివెన్నెల చేత రాయించే రవికిషోర్ గారు ఈ మధ్య ఎక్కువ రామ జోగయ్య శాస్త్రి (RJS) గారిచేత రాయిస్తున్నారు. ఇందులో 6 పాటలు ఉంటే 5 పాటలు RJS రాసినవే. ఈయన కూడా సిరివెన్నెల పంథాలో లలితమైన పదాలతో అశ్లీలత లేకుండా రాయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే!
1. పల్లవి: తనేమందో
రచన: సిరివెన్నెల
సందర్భం: తొలి ప్రేమ గీతం. ప్రేయసి తనని ఇష్టపడ్డాక ప్రియుడు పరవశంలో పాడుకునే పాట
ప్రేమ గీతాల్లో సిరివెన్నెల ఇచ్చినన్ని expressions ఇంకెవరూ ఇవ్వలేదు అన్న మాట నిజమే అని మరో సారి నిరూపించే పాట ఇది. ఇలాటి వేల పాటలు రాశాకా కూడా -
కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే!
లాటి కొత్త expression ఇచ్చిన ఆయన ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం, ఈ పాట సాహిత్యానికి స్పందించకుండా ఉండలేం. ముఖ్యంగా మొదటి చరణం లిరిక్ చాలా బాగుంది.
2. పల్లవి: లల్లలై
రచన: RJS
సందర్భం: ప్రేమ జంట పాడుకునే హుషారు గీతం.
పల్లవి చాలా సింపుల్గా ఉంటూనే క్యాచీ గా ఉండేలా రాయడంలో RJS పూర్తిగా విజయం సాధించారు -
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనబడదాం!
మనం ఒకటైతే సరిపోదే, మన నీడలని ఏం చేద్దాం?
వాటినీ పక్కన నిలిపి, ఒకటిగ కలిపి ప్రేమని పేరెడెదాం!!
చరణాల్లో కూడా మంచి expressions ఇచ్చారు RJS -
కొంటె దిగులంతా అలికిందా
ఈ వయసున గిలిగింత!
తీగ లాగిందే నువ్వని
తొణికిందేమో పెంచిన ప్రేమంతా!!
మాస్ నీ, క్లాస్ నీ కూడా అలరించేలా రాయడం ఎలాగో ఈ పాట సాహిత్యం చూసి నేర్చుకోవచ్చు.
3. పల్లవి: తెలిసిన మాటే
రచన: RJS
సందర్భం: ఇదీ ప్రేమ గీతమే. అయితే ఈ సారి అమ్మాయి పాడే సోలో.
ఈ పాటలో కూడా మంచి expressions ఇచ్చారు RJS. పల్లవిలో వినిపించే ఈ వాక్యాలు నాకు నచ్చాయ్ -
చినుకైనా తడిలేని వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా!
తనువంతా ఒణికింది ఆనందాన
పదాల పొందికలో తన గురువుగారు సిరివెన్నెలని తలపించడం ఈ పాటలోనూ చూడొచ్చు. కొత్తదనానికి ఎప్పుడూ ప్రయత్నించడం ఈ వాక్యంలో కనిపిస్తుంది -
ఆకాశమా ఇకపైన నా లోకమే నీ పైన
నీ మెరుపుకే మెరుపందించనా
4. పల్లవి: రాజ కుమరీ
రచన: RJS
సందర్భం: ఇదీ ఒక హుషారు యుగళ గీతమే!
RJS రాసిన “జెన్నిఫర్ లోపెజ్” పాటా (జల్సా చిత్రం), “ఓం నమస్తే” పాటా (రెడీ చిత్రం) మీరు విని వుంటే మోడర్న్ ఇంగ్లీష్ expressions ఇస్తూ హిందీని కూడా అక్కడక్కాడా వాడి రాసే స్టైల్ ఒకటి కనిపిస్తుంది. ఇదే స్టైల్ లో సాగే పాట ఇది. నాకు ఇలాటివి అంతగా నచ్చవు (సాహితీ పరంగా) కానీ జనాలకు నచ్చొచ్చు. ఏదేమైనా సరికొత్త ప్రయోగాలు ఈ పాటలో RJS చేశారని చెప్పొచ్చు -
volcano వరదై వచ్చి అంటిస్తున్నా wild fire
all the sides ఆవిరిలోన ముంచేస్తాడీ జాదుగర్!
5. పల్లవి: చలొరె చలొరె
రచన: RJS
సందర్భం: పిల్లలతో హీరో పాడే పాట.
ఇది చాలా వెరైటీ పాట. పిల్లలకి నచ్చినవన్నీ హీరో చేస్తానూ ఇస్తానూ అంటూ పాడతాడు. modern & cute song ఇది. ఇంకేముంది RJS తనదైన స్టైల్ చూపించారు -
మన ఇష్టం మనమింతే ఉంటాం
ఆనందం మన oxygen అంటాం
school bag లైటై పోయే super technique చెప్తా
ఈజీగా గుర్తుండేలా syllabus మార్చేస్తా
mountain full of Maggi తెస్తా
fountain లా Fanta పొంగిస్తా!
ATMలో ice-cream ఇస్తా!!
6. పల్లవి: రాజా మహరాజా
రచన: RJS
సందర్భం: హీరో తన వ్యక్తిత్వం గురించి పాడే పాట. introductory song కావొచ్చు.
RJS అంటే నిజానికి ఇప్పటి దాకా నాకు మరీ అంత గొప్ప అభిప్రాయం లేదు. బాగా రాస్తారు అనుకున్నా అంతే. అయితే ఈ పాట విన్నాక ఆయన talent నాకు తెలిసొచ్చింది. ఈ పాట ట్యూన్ రచయితని కాస్త కష్టపెట్టేదే. అయినా RJS అలవోకగా పదాలు పొదిగారు. చరణాల్లో అద్భుతమైన భావాలు పలికించి సిరివెన్నెలని గుర్తు చేశారు -
చెట్టూ పుట్టా రాయీ రప్పా నవ్వే వీలుందా
పెదవికి నవ్వోటిస్తే చీ చీ పొమ్మంటుందా
చిటపటా చిర్రుబుర్రూ మంతో పుట్టిందా
చిటికేస్తే గలగల సందడి దిగి రాదా
మొత్తానికి చక్కటి సాహిత్యం ఉన్న ఆడియో.

స్రవంతి మూవీస్ నుంచి వస్తున్న ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్. మొత్తం సిరివెన్నెల చేత రాయించే రవికిషోర్ గారు ఈ మధ్య ఎక్కువ రామ జోగయ్య శాస్త్రి (RJS) గారిచేత రాయిస్తున్నారు. ఇందులో 6 పాటలు ఉంటే 5 పాటలు RJS రాసినవే. ఈయన కూడా సిరివెన్నెల పంథాలో లలితమైన పదాలతో అశ్లీలత లేకుండా రాయడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే!

ganeshjustganesh

1. పల్లవి: తనేమందో

రచన: సిరివెన్నెల

సందర్భం: తొలి ప్రేమ గీతం. ప్రేయసి తనని ఇష్టపడ్డాక ప్రియుడు పరవశంలో పాడుకునే పాట

ప్రేమ గీతాల్లో సిరివెన్నెల ఇచ్చినన్ని expressions ఇంకెవరూ ఇవ్వలేదు అన్న మాట నిజమే అని మరో సారి నిరూపించే పాట ఇది. ఇలాటి వేల పాటలు రాశాకా కూడా -

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే!

లాటి కొత్త expression ఇచ్చిన ఆయన ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం, ఈ పాట సాహిత్యానికి స్పందించకుండా ఉండలేం. ముఖ్యంగా మొదటి చరణం లిరిక్ చాలా బాగుంది.

2. పల్లవి: లల్లలై

రచన: RJS

సందర్భం: ప్రేమ జంట పాడుకునే హుషారు గీతం.

పల్లవి చాలా సింపుల్గా ఉంటూనే క్యాచీ గా ఉండేలా రాయడంలో RJS పూర్తిగా విజయం సాధించారు -

లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం

లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనబడదాం!

మనం ఒకటైతే సరిపోదే, మన నీడలని ఏం చేద్దాం?

వాటినీ పక్కన నిలిపి, ఒకటిగ కలిపి ప్రేమని పేరెడెదాం!!

చరణాల్లో కూడా మంచి expressions ఇచ్చారు RJS -

కొంటె దిగులంతా అలికిందా

ఈ వయసున గిలిగింత!

తీగ లాగిందే నువ్వని

తొణికిందేమో పెంచిన ప్రేమంతా!!

మాస్ నీ, క్లాస్ నీ కూడా అలరించేలా రాయడం ఎలాగో ఈ పాట సాహిత్యం చూసి నేర్చుకోవచ్చు.

3. పల్లవి: తెలిసిన మాటే

రచన: RJS

సందర్భం: ఇదీ ప్రేమ గీతమే. అయితే ఈ సారి అమ్మాయి పాడే సోలో.

ఈ పాటలో కూడా మంచి expressions ఇచ్చారు RJS. పల్లవిలో వినిపించే ఈ వాక్యాలు నాకు నచ్చాయ్ -

చినుకైనా తడిలేని వాన

మనసంతా కురిసేనా ఈ సమయాన

హరివిల్లై కనిపించే నా నీడైనా!

తనువంతా ఒణికింది ఆనందాన

పదాల పొందికలో తన గురువుగారు సిరివెన్నెలని తలపించడం ఈ పాటలోనూ చూడొచ్చు. కొత్తదనానికి ఎప్పుడూ ప్రయత్నించడం ఈ వాక్యంలో కనిపిస్తుంది -

ఆకాశమా ఇకపైన నా లోకమే నీ పైన

నీ మెరుపుకే మెరుపందించనా

4. పల్లవి: రాజ కుమరీ

రచన: RJS

సందర్భం: ఇదీ ఒక హుషారు యుగళ గీతమే!

RJS రాసిన “జెన్నిఫర్ లోపెజ్” పాటా (జల్సా చిత్రం), “ఓం నమస్తే” పాటా (రెడీ చిత్రం) మీరు విని వుంటే మోడర్న్ ఇంగ్లీష్ expressions ఇస్తూ హిందీని కూడా అక్కడక్కాడా వాడి రాసే స్టైల్ ఒకటి కనిపిస్తుంది. ఇదే స్టైల్ లో సాగే పాట ఇది. నాకు ఇలాటివి అంతగా నచ్చవు (సాహితీ పరంగా) కానీ జనాలకు నచ్చొచ్చు. ఏదేమైనా సరికొత్త ప్రయోగాలు ఈ పాటలో RJS చేశారని చెప్పొచ్చు -

volcano వరదై వచ్చి అంటిస్తున్నా wild fire

all the sides ఆవిరిలోన ముంచేస్తాడీ జాదుగర్!

5. పల్లవి: చలొరె చలొరె

రచన: RJS

సందర్భం: పిల్లలతో హీరో పాడే పాట.

ఇది చాలా వెరైటీ పాట. పిల్లలకి నచ్చినవన్నీ హీరో చేస్తానూ ఇస్తానూ అంటూ పాడతాడు. modern & cute song ఇది. ఇంకేముంది RJS తనదైన స్టైల్ చూపించారు -

మన ఇష్టం మనమింతే ఉంటాం

ఆనందం మన oxygen అంటాం

school bag లైటై పోయే super technique చెప్తా

ఈజీగా గుర్తుండేలా syllabus మార్చేస్తా

mountain full of Maggi తెస్తా

fountain లా Fanta పొంగిస్తా!

ATMలో ice-cream ఇస్తా!!

6. పల్లవి: రాజా మహరాజా

రచన: RJS

సందర్భం: హీరో తన వ్యక్తిత్వం గురించి పాడే పాట. introductory song కావొచ్చు.

RJS అంటే నిజానికి ఇప్పటి దాకా నాకు మరీ అంత గొప్ప అభిప్రాయం లేదు. బాగా రాస్తారు అనుకున్నా అంతే. అయితే ఈ పాట విన్నాక ఆయన talent నాకు తెలిసొచ్చింది. ఈ పాట ట్యూన్ రచయితని కాస్త కష్టపెట్టేదే. అయినా RJS అలవోకగా పదాలు పొదిగారు. చరణాల్లో అద్భుతమైన భావాలు పలికించి సిరివెన్నెలని గుర్తు చేశారు -

చెట్టూ పుట్టా రాయీ రప్పా నవ్వే వీలుందా

పెదవికి నవ్వోటిస్తే చీ చీ పొమ్మంటుందా

చిటపటా చిర్రుబుర్రూ మంతో పుట్టిందా

చిటికేస్తే గలగల సందడి దిగి రాదా

మొత్తానికి చక్కటి సాహిత్యం ఉన్న ఆడియో.  ఈ పాటలు ఇక్కడ వినొచ్చు: రాగలహరి

వ్యాఖ్యానించండి

Latest updates!

ఈ బ్లాగు పేరు గతంలో “తెరచాటు చందమామ” అని ఉండేది. కేవలం సినిమా పాటల వివరణలు, విశ్లేషణలు ఉండేవి. మధ్యలో నా కవితలు, ఇతర వ్యాసాలు కూడా కలపడంతో “ఎద రస నస” అని పేరు మార్చాను. అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను! ఇప్పుడు మళ్ళీ ఈ బ్లాగుని సినిమా పాటల విశ్లేషణకే పరిమితం చెయ్యడం మంచిది అనిపిస్తోంది. అందుకే కొన్ని పోస్టులని నా ఇతర బ్లాగుల్లోకి మార్చాను. బ్లాగు పేరు మళ్ళీ “తెరచాటు చందమామ” అయ్యింది.
సంపూర్ణాలు – ఒక పాట గురించి పూర్తిగా వివరణ
చెణకులు – పాటలో కొన్ని లైన్ల గురించి విశేషాలు
విన్నవీ నచ్చినవీ – కొత్తగా రిలీజ్ అయిన ఆడియో సాహితీ విశేషాలు
వ్యాసాలు – పాటల గురించి, గీత రచయితల గురించి రాసిన వ్యాసాలు

ఈ బ్లాగు పేరు గతంలో “తెరచాటు చందమామ” అని ఉండేది. కేవలం సినిమా పాటల వివరణలు, విశ్లేషణలు ఉండేవి. మధ్యలో నా కవితలు, ఇతర వ్యాసాలు కూడా కలపడంతో “ఎద రస నస” అని పేరు మార్చాను. అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను! ఇప్పుడు మళ్ళీ ఈ బ్లాగుని సినిమా పాటల విశ్లేషణకే పరిమితం చెయ్యడం మంచిది అనిపిస్తోంది. అందుకే కొన్ని పోస్టులని నా ఇతర బ్లాగుల్లోకి మార్చాను. బ్లాగు పేరు మళ్ళీ “తెరచాటు చందమామ” అయ్యింది.

ఇకపై ఈ బ్లాగు పూర్తిగా తెలుగు సినీ సాహిత్యానికే పరిమితం. ఇందులో ఈ categories ఉన్నాయ్:

సంపూర్ణాలు - ఒక పాట గురించి పూర్తిగా వివరణ

చెణకులు – పాటలో కొన్ని లైన్ల గురించి విశేషాలు

విన్నవీ నచ్చినవీ – కొత్తగా రిలీజ్ అయిన ఆడియో సాహితీ విశేషాలు

వ్యాసాలు - పాటల గురించి, గీత రచయితల గురించి రాసిన వ్యాసాలు

వ్యాఖ్యానించండి

విన్నవీ నచ్చినవీ – ఈనాడు

A Wednesday సినిమాని తెలుగులో “ఈనాడు” అన్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో పాటలు కూడా పెట్టారు (మూలంలో ఉన్నట్టు నాకు గుర్తు లేదు). కమల్ కూతురు శ్రుతి హాసన్ ఈ సినిమాకి సంగీతం అందించడం ఒక విశేషం. సగం పాటలు తనూ మరియు మన ప్రియతమ కమల్ హాసనే  (అవును! కమల్ పాడతాడని మీకు తెలియదా?) పాడ్డం జనాలకి నచ్చుతుందో లేదో మరి!  ఏదేమైనా ఈ పాటల సాహిత్యం గురించి క్లుప్తంగా -
1. పాట: ఈనాడు
రచన: వెన్నెలకంటి
సందర్భం: back ground song? టెర్రర్ కీ ఒక ముఖం ఉందని చెప్తూ సాగుతుంది.
నిజానికి ఈ పాటలో వాక్యాలు ఎక్కువ లేవు. “ఈ నాడు వచ్చాడు మనకోసం మనలో ఒకడు” అన్న వాక్యమే మొత్తం పాటంతా వినిపిస్తుంది. వెన్నెలకంటి కెరీర్ లో రాసిన అతి చిన్న పాట ఇదేనేమో!
2.  పాట: ఈనాడు ఈ సమరం
రచన: వెన్నెలకంటి
సందర్భం: ఇదీ back ground song అని అనిపిస్తోంది. సినిమాలో అన్నీ ఇలాటివే కావొచ్చు.
ఇదీ ఎక్కువ వాక్యాలు లేని పాటే. అయితే మొదటి పాటతో పోలిస్తే బెటరే. ఈ పాట కూడా తీవ్రవాదం తద్వారా జరిగే హింస గురించే -
ఎపుడో చంపే దేవతలూ
ఇపుడే చంపే మతోన్మాదులు
అన్న వాక్యాలు ఈ పాట సారంశం తెలియజేస్తాయి.
3. పాట: నింగి హద్దు
రచన: భువనచంద్ర, బ్లేజ్
సందర్భం: ఆశా గీతాలాపనలా తోస్తోంది.
ఈ పాటలో rap ఒకటి ఏడ్చింది కాబట్టి తెలుగు కన్నా ఇంగ్లీషే వినబడుతుంది. తెలుగు పదాలు అతి కష్టంగా కొంత కృతకంగా వినిపిస్తాయ్. ఉన్న తెలుగు వాక్యాలు ఒకటో రెండో. కాబట్టి పెద్ద చెప్పుకోడానికి ఏమీ లేదు.
4. పాట: అల్లా జానే
రచన: వేటూరి
సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్థితులని వివరించే పాట
మొత్తం సినిమాలో తెలుగు లిరిక్ ఎక్కువున్న పాట ఇదే. వేటూరి బాగా రాశారని అనిపించింది -
వేదన తిరిగే వీధులు చూడు
గుమ్మాలన్నీ ఏడ్చెను నేడు
వేటూరి imagery ని బాగా వాడతారని తెలిసిందే కదా (ఆ imagery మనకి అర్థం అవుతుందా లేదా అన్నది పక్కన
పెడితే!). ఇక్కడా అది కనిపిస్తుంది -
పిల్లలు జడిసే నాట్య పిశాచం
వెన్నెల మింగే పున్నమి భూతం
గోడల గొంతున మృతుల రోదనం
దిశలే పగిలే దీనాలపనం
ఒక్కసారి ఊహించుకోండి. పై వాక్యాలు పూర్తిగా అర్థం కాకపోయినా (అసలే అర్థమే లేకపోయినా!) ఏదో దిగులు లాటి ఫీలింగ్ కలుగుతుంది. దటీజ్ వేటూరి!
5. పాట: అల్లా జానే (Remix)
రచన: వేటూరి
సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్తుథలని వివరించే పాట
పై పాట కమల్ పాడితే ఈ పాట శ్రుతి హాసన్ పాడింది. remix అన్న మాట. ఇందులో “వినాయక” అని వినిపిస్తుంది. ఇందాక పాటలో “అల్లా” అన్నారు కాబట్టి ఇక్కడ “వినాయక” అన్నారేమో మరి!!
ఈ పాటలు streaming audio లో ఇక్కడ వినొచ్చు –  http://www.ragalahari.com/newreleasesdetail.asp?newmvname=Eenaadu

A Wednesday సినిమాని తెలుగులో “ఈనాడు” అన్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో పాటలు కూడా పెట్టారు (మూలంలో ఉన్నట్టు నాకు గుర్తు లేదు). కమల్ కూతురు శ్రుతి హాసన్ ఈ సినిమాకి సంగీతం అందించడం ఒక విశేషం. సగం పాటలు తనూ మరియు మన ప్రియతమ కమల్ హాసనే  (అవును! కమల్ పాడతాడని మీకు తెలియదా?) పాడ్డం జనాలకి నచ్చుతుందో లేదో మరి!  ఏదేమైనా ఈ పాటల సాహిత్యం గురించి క్లుప్తంగా -

eenaadu

1. పాట: ఈనాడు

రచన: వెన్నెలకంటి

సందర్భం: back ground song? టెర్రర్ కీ ఒక ముఖం ఉందని చెప్తూ సాగుతుంది.

నిజానికి ఈ పాటలో వాక్యాలు ఎక్కువ లేవు. “ఈ నాడు వచ్చాడు మనకోసం మనలో ఒకడు” అన్న వాక్యమే మొత్తం పాటంతా వినిపిస్తుంది. వెన్నెలకంటి కెరీర్ లో రాసిన అతి చిన్న పాట ఇదేనేమో!

2.  పాట: ఈనాడు ఈ సమరం

రచన: వెన్నెలకంటి

సందర్భం: ఇదీ back ground song అని అనిపిస్తోంది. సినిమాలో అన్నీ ఇలాటివే కావొచ్చు.

ఇదీ ఎక్కువ వాక్యాలు లేని పాటే. అయితే మొదటి పాటతో పోలిస్తే బెటరే. ఈ పాట కూడా తీవ్రవాదం తద్వారా జరిగే హింస గురించే -

ఎపుడో చంపే దేవతలూ

ఇపుడే చంపే మతోన్మాదులు

అన్న వాక్యాలు ఈ పాట సారంశం తెలియజేస్తాయి.

3. పాట: నింగి హద్దు

రచన: భువనచంద్ర, బ్లేజ్

సందర్భం: ఆశా గీతాలాపనలా తోస్తోంది.

ఈ పాటలో rap ఒకటి ఏడ్చింది కాబట్టి తెలుగు కన్నా ఇంగ్లీషే వినబడుతుంది. తెలుగు పదాలు అతి కష్టంగా కొంత కృతకంగా వినిపిస్తాయ్. ఉన్న తెలుగు వాక్యాలు ఒకటో రెండో. కాబట్టి పెద్ద చెప్పుకోడానికి ఏమీ లేదు.

4. పాట: అల్లా జానే

రచన: వేటూరి

సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్థితులని వివరించే పాట

మొత్తం సినిమాలో తెలుగు లిరిక్ ఎక్కువున్న పాట ఇదే. వేటూరి బాగా రాశారని అనిపించింది -

వేదన తిరిగే వీధులు చూడు

గుమ్మాలన్నీ ఏడ్చెను నేడు

వేటూరి imagery ని బాగా వాడతారని తెలిసిందే కదా (ఆ imagery మనకి అర్థం అవుతుందా లేదా అన్నది పక్కన

పెడితే!). ఇక్కడా అది కనిపిస్తుంది -

పిల్లలు జడిసే నాట్య పిశాచం

వెన్నెల మింగే పున్నమి భూతం

గోడల గొంతున మృతుల రోదనం

దిశలే పగిలే దీనాలపనం

ఒక్కసారి ఊహించుకోండి. పై వాక్యాలు పూర్తిగా అర్థం కాకపోయినా (అసలే అర్థమే లేకపోయినా!) ఏదో దిగులు లాటి ఫీలింగ్ కలుగుతుంది. దటీజ్ వేటూరి!

5. పాట: అల్లా జానే (Remix)

రచన: వేటూరి

సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్థితులని వివరించే పాట

పై పాట కమల్ పాడితే ఈ పాట శ్రుతి హాసన్ పాడింది. remix అన్న మాట. ఇందులో “వినాయక” అని వినిపిస్తుంది. ఇందాక పాటలో “అల్లా” అన్నారు కాబట్టి ఇక్కడ “వినాయక” అన్నారేమో మరి!!

ఈ పాటలు streaming audio లో ఇక్కడ వినొచ్చు - ragalahari

వ్యాఖ్యానించండి