ఈ బ్లాగు గురించి

“సినిమా పాటల్లో సాహిత్యం, కవిత్వం ఏమిటి?” అని ప్రశ్నించే వాళ్ళకి ధీటుగా జవాబిచ్చే ఎన్నో పాటలు మనకున్నాయి. సముద్రాల, పింగళి, సినారె, దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, సిరివెన్నెల … ఇలా ఎందరో కవులు గొప్ప పాటలు రాశారు. ఇలాంటి చక్కని పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన స్పందనకి అక్షరరూపమే ఈ బ్లాగ్.

“ఓహో…అయితే ఇదొక Telugu lyrics బ్లాగా” అనేసుకోకండి! కాదు. ఎందుకంటే ఇక్కడ పాటలో సంగీతం కంటే సాహిత్యానికే అగ్రతాంబూలం. అంటే tune, music తీసేసినా నిలబడగలిగే ఉత్తమ సాహిత్యమే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు పాటని చదవడానికి రావాలి, పాడుకోడానికి కాదు!

మన సినిమాల్లో ఎప్పుడూ సంగీతమే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కాబట్టి సినిమా ఆడియో హిట్ కాకుంటే అసలు సాహిత్యం ఎలా ఉన్నా కనుమరుగైపోయే పాటలే ఎక్కువ. పైగా, అసలు సినిమాయే flop అయితే ఇక పాటలు చాలా సార్లు సమాధి అయిపోయినట్టే. కాబట్టి అంతగా పేరుగాంచని గొప్ప సాహిత్యాన్ని ఇక్కడ పెట్టే ప్రయత్నం జరిగింది.

నేను విన్న పాటలు ఎక్కువ వేటూరివి, సిరివెన్నెలవే కనుక వారి పాటలే ఇక్కడ ఎక్కువ కనిపించొచ్చు.

ఇక నాకు తెలుగు భాషపై కానీ, కవిత్వం, సాహిత్యం లాంటి విషయాల్లో గానీ కేవలం ఆసక్తే తప్పించి పాండిత్యం లేదు కాబట్టి నేను రాసిన వాటిల్లో తప్పులు ఉండే ఉంటాయి. తెలిసిన వాళ్ళు సరిజేస్తే ధన్యుడను.

అభిప్రాయములు »

  1. cbrao చెప్పబడిన

    పాటల బ్లాగులోచ్చాయి కాని ఇలా పాటకు అర్థం, పరమార్థం తెలియ చెప్పే ఈ ప్రయత్నం బాగుంది. చాలా variety గా ఉంది. మీ గురించి కూడ రాయండి about page లో.

  2. Ranare చెప్పబడిన

    ఫణీంద్రగారు, మీ గురించి మీరు చెప్పుకున్న విధంలోని స్పష్టత నాకు నచ్చింది. మీ అభిరుచి ఈ బ్లాగురూపందాల్చడం మాకెంతో ఆనందకరం. ఇకనుంచి, ఈ గూటికి తరచూవచ్చేవాళ్లలో నేనూ ఒకడిని.

  3. prasadm చెప్పబడిన

    నేను కూడా మీ బ్లాగు కు వస్తూ ఉంటానోచ్!

  4. సత్యసాయి చెప్పబడిన

    చాలా బాగుంది మీ ఉద్దెశ్యం. రంగేళి పాట సాహిత్యం చాలా బాగుంది. ఇప్పుడే సిరివెన్నెలగారి జెమినీ టీవీ ఇంటర్వ్యూ చూసి మీ బ్లాగు చూసా. అందుకని ఇంకా బాగా ఆనందించా. జగమంత పాటకి సాహిత్యం పెట్టగలరా?

  5. Madhu చెప్పబడిన

    Chala bagundi phanindra garu,
    Naaku oka doubt? complete telugu lo ee site implement chesaru kada, telugu software emaina vupayoginchara meeru?
    naaku telugu word details emaina vunte kaavali..pls

  6. Siva prasad చెప్పబడిన

    Dear Phaneendra garu,
    Chaala santoshanga vundi.intavaraku epudu mee blog choodaledu.Meeru enchukunna vishayam chaala chaala baagundi.chadivina taruvaata naalo vunna kavi aasaantam accheruvondaadu, aanandapaddadu, ilanti saahitya vedika chaala avasaram ani kooda annadu.Dayachesi mee mail id pampinchara, please.meeto matladaaalani vundi………
    aamanai kai koila,niseedhi kai vennela,nenoooooo mee mail kosam vechi vuntaanilaaa……..

    Itlu,
    siva prasad.Nama
    Design Engineer
    I2T2 India LTD,Hyderabad.
    Mail:sprasad.nama@gmail.com
    Mobile:9440328653

  7. మాలతీ మాధవం చెప్పబడిన

    మీ రాసిన విషయం, శైలి ఎంతో బాగున్నాయి. చివరిగా డిసెంబర్ 31 న రాశారు.అందులో వ్యాఖ్యలు చేసే వీలు లేకుండా ఎందుకు చేశారు? మీరు మళ్ళీ ఎందుకు రాయలేదు? దయచేసి రాయడం మానివేయకండి.

  8. veera sekhar Aditya చెప్పబడిన

    chaala baavundhi…,

    sangitam…,saahityam tho paatu

    vaati visleshana …,padha bhava charcha superb…

    thanks manikya garuu…,

  9. veera sekhar Aditya చెప్పబడిన

    ee blog ni nenu chaala late ga cheraanu…,

    mana laaga ilanti blog ni abhi maniche…, paatalanu ista pade

    vaallu inkaa chala mandhi vuntaaru kadaa…,

    mari alanti vaariki cheruva avvadaaniki…,

    meeru emaina promotion work tesukovachhu kada..,

  10. veera sekhar Aditya చెప్పబడిన

    ee blog ni nenu chaala late ga cheraanu…,

    mana laaga ilanti blog ni abhi maniche…, paatalanu ista pade

    vaallu inkaa chala mandhi vuntaaru kadaa…,

    mari alanti vaariki cheruva avvadaaniki…,

    meeru emaina promotion work tesukovachhu kada..,

    suchana maatraame ..!

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి