బధ్రపరచినది చెణకులు (tit-bits)

తార తారకీ నడుమ ఆకాశం

తార తారకీ నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకీ నడుమ ఆవేశం అందుకే

వేటూరి రాసిన ఈ వాక్యాలు, “కల్పన” చిత్రంలో “ఒక ఉదయంలో” అనే పాట లోనివి. ఈ వాక్యాలు మొదటి సారి విన్నప్పుడు variety గా ఉన్నాయనిపించింది కాని అర్థం కాలేదు. తర్వాత వేటూరి ఒక interview లో ఈ వాక్యాలు ఉదహరిస్తూ, రాఘవేంద్ర రావు గారు ఈ పాట విని తనని కౌగిలించుకుని “ఇక నా సినిమాలన్నిటికీ మీరే writer” అన్నారని చెప్పారు. అప్పుడు “అబ్బో” అనుకుని తెగ కష్టపడినా అర్థం కొరుకుడు పడలేదు.

ఈ మధ్యే ఒక కవిత గురించి ఆలోచిస్తున్నాను. ఎంతకీ ఏమీ రాదే! మథనమో, జ్వలనమో, అలజడో ఏదైతేనే పడితే మెరుపులా ఒక ఊహ అదంతట అదే పుట్టుకొచ్చింది. కవిత అన్నది ఎప్పుడూ (ఆ మాటకొస్తే ఏ creative activity అయినా) ఆలోచన వల్ల పుట్టదు. అయితే ఆ mood and flow లోకి వెళ్ళడానికి ఆలోచనని సాధనంగా వాడతాం. మనలోని ప్రాణ చైతన్యం వల్ల వికసించే creativity ఉదయించే క్షణంలో ఆలోచన ఉండదు. అందుకే “creativity classes” లో “Empty your mind” అని చెబుతూ ఉంటారు. ఈ విధంగా చూస్తే ఒక రకమైన శూన్యం నుంచి creativity పుడుతుంది.

ఇప్పుడు ఈ angle లో పై వాక్యాలు చదవండి. “పాట” అంటే “కవిత” అన్న అర్థంలో వేటూరి వాడారని గ్రహించాలి. ఇక “ఆవేశం” అంటే కోపం + తొందరుపాటుతనంతో కూడినది అన్న అర్థంలో కాక passion అన్న అర్థంలో వేటూరి తరచూ వాడుతూ ఉంటారు (భావావేశం, కవితావేశం etc). కవితలోని ప్రతి creative ఊహకీ మధ్య (పాట పాటకీ నడుమ) passion or జ్వలనం అనే శూన్యం ఉంటుంది. ఇదెలా ఉంది అంటే తార తారకీ మధ్య ఆకాశం ఉన్నట్టు (ఆకాశం అంటే శూన్యమే కదా!).

అదండీ సంగతి! మీ మనసులో నక్షత్రాలు పుట్టించాలంటే మరి జ్వలించండిక!!

P.S ఇంతకీ వేటూరి భావం ఇదే కాదో తెలియదు కానీ, నేను మాత్రం “ఆహా” అనేసుకుని మనసులో ఒక దణ్ణం పెట్టేసుకున్నాను.

వ్యాఖ్యలు (4)

పంచదార ఎడారి !

mass పాటల్లో వేటూరిని మనం తిట్టుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే శ్రుతిమించిన ప్రయోగాలు, అర్థం పర్థం లేని పద-గారడీలు చాలానే చేశారు కనుక. అయితే చెత్త పాటల్లో కూడా అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని మెచ్చదగిన ప్రయోగాలు చేసినప్పుడు మాత్రం మెచ్చుకోవాలి. “భలే దొంగలు” అనే ఒక కొత్త సినిమాలోని ఒక mass song పల్లవి చూడండి -

పంచదార ఎడారిలో పడుచు గుర్రం సవారిలో

variety గా ఉంది. “పంచదార ఎడారి” లాటి ప్రయోగాలు వేటూరే చెయ్యగలరు అనిపిస్తుంది.

మిగతా పాటలో పెద్ద విషయం లేదు…ట్యూన్ mass గా ఇస్తూనే చరణం మధ్యలో కాస్త classical touch ఉన్న bit వాడిన K.M. Radha Krishnan (music director)  మార్కులు కొట్టేస్తాడు. వేటూరి కూడా ఆ bit కి భావ ప్రధానమైన lyric  రాసి మురిపించారు -

తాకే తనువులలో తగిలే సొగసెంత?
సోకే వలపులలో రగిలే వయసంత!
….

అందే పెదవులలో చిందే మధువెంత?
పొందే ముడుపులకి ఉంది తగినంత !!

అలాగే కంత్రీ లో “వయస్సునామీ తాకెనమ్మీ” పల్లవి గల పాట.

ఇక్కడ “వయస్సునామీ” అన్న పద ప్రయోగం ముద్దుగా ఉంది, Tune కి ఎంతో perfect గా సరిపోయి, అందాన్ని తెచ్చింది. మిగతా పాటలో చెప్పుకునేందుకు పెద్ద ఏమీ లేదు…routine mass song…కొంత శ్రుతి మించింది ఏమో కూడా

వ్యాఖ్యలు (5)

ఆడవే హంసగమన

కొన్ని వాక్యాలు వింటే చాలా మాములుగా అనిపిస్తాయ్. పెద్ద గొప్ప అర్థం ఏమీ కనిపించదు. అలాటి మామూలు వాక్యాల్లో కూడా కొన్ని సార్లు మనకి తెలియని గొప్ప అర్థాలు ఉండచ్చు, ముఖ్యంగా వేటూరి లాంటి కవుల విషయంలో.

ఈ కింది వాక్యాలు చూడండి:

ఆడవే హంసగమన
నడయాడవే ఇందువదన

“విరాట పర్వం” అనే సినిమాలో NTR బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడిగా నటించారు. విరాటుని కొలువులో ఉంటూ “ఉత్తర”కి నాట్యం నేర్పిస్తున్నప్పుడు పాడే పాట ఇది.

చూస్తే “హంసలా ఆడు ఓ చంద్రుని వంటి మోము కలదానా” అనే మామూలు అర్థమే కనిపిస్తుంది నాలాటి సామాన్యులకి… వేటూరి విడమర్చి చెప్పేదాకా -

“నేను (వేటూరి) పాట రాసి ఇస్తే అది చూసి NTR గారు పక్కనే ఉన్న వెంకటకవి గారికి ఇచ్చారు.

ఆడవే హంసగమన, నడయాడవే ఇందువదన

అనే పల్లవి చూసి కవిగారు హంసగమనా ఆడవే అన్నారు, హంస నాట్యానికి ప్రసిద్ధి కాదు కదా అని అడిగారు.

వెంటనే నేను – అక్కడ మాట అంటున్నది పేడి అయిన బృహన్నల కాదు! అతనిలో దాగి ఉన్న నాట్యకోవిదుడైన అర్జునుడు. అతను హంసలనూ, నెమళ్ళనూ కాక అంతకన్న ఉదాత్తమైన, తన స్థాయికి తగిన ఉపమానోపమేయాలు తేవాలి కదా – అందుకే ఇక్కడ “హంస” శబ్దం సూర్యపరంగా వాడాను. క్రమం తప్పని గమనంలో సూర్యుడంతటి సమగమనం కలదానా అని అర్థం. అక్కడ హంస సూర్యపరంగా వాడాను కాబట్టే “నడయాడవే ఇందువదనా” అనడం! గమనశ్రమ ఎంత కలిగినా ఆహ్లాదకరమైన చంద్రుడి వదనమే కలదానా అనే అర్థంలో చెప్పడం జరిగింది” అన్నాను.

వెంకటకవి గారు ఆశువుగా ఏదో పద్యపాదం చదివి లేచి నన్ను కౌగిలించుకున్నారు. నా విషయంలో NTR గారు  ఆనాడు ఎంత తృప్తి వెల్లడించారో అక్కడే ఉన్న సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు పదే పదే చాలా కాలంగా ఆ సంఘటనే ప్రస్తావించేవారు. “

అదండీ సంగతి! “ఊరక రాయరు మహానుభావులు” అని ఊరికే అన్నారా!

(వేటూరి “హాసం” అనే పత్రికలో రాసిన ఒక పాత వ్యాసం నుండి ఈ విషయం సంగ్రహించబడింది. ఈ వ్యాసాలు కొన్ని తర్వాత “కొమ్మ కొమ్మకో సన్నాయి” అనే పుస్తకంగా కూడా వచ్చాయి).

వ్యాఖ్యలు (5)

ఏ చికితా కొమస్తాస్!

అసలు ఒక రచయిత రాశాడు అని మనకి అనిపించే పాటలో నిజంగా ఆ రచయిత రాసినది ఎంత? మన సినిమా రచయితలకి తనకి నచ్చినట్టు రాసే పూర్తి స్వేచ్ఛ ఉందా? ఒక ఉదాహరణ చూద్దాం.

“బద్రి” సినిమాలో వినిపించే ఒక popular పాట పల్లవి మొదటి రెండు లైన్లు:

ఏ చికితా కొమస్తాస్!
జాయన్ అయితే జమస్తాస్!

రాసినది వేటూరి. ఈ లైన్లు చదివితే కొంత మందికి వేటూరి మీద కోపం వస్తుంది. అర్థంపర్థం లేని ఈ సాహిత్యం ఏమిటీ అని అనుకోవడమూ న్యాయమే. అయితే ఈ పరిస్థితికి వేటూరే పూర్తి బాధ్యుడు కాదు. వివరాల్లోకి వెళ్తే -

చికితా అన్నది Spanish పదం (chiquita). అర్థం “చిన్నది” అని అనుకోవచ్చు.

పాట “ae chiquita cómo es usted”
అంటే “ఏం చిన్నదానా, ఎట్లా ఉన్నావు” అని అర్థం.

వేటూరి Spanish ఎప్పుడు నేర్చుకున్నాడు అని మనం ఆశ్చర్యపోయేలోపు ఆయనే చెప్పిన విషయం ఇది:

“…అలా Spanish పదాలతో మొదలెట్టమని ఆ hero గారు చెప్పారు. అలాంటప్పుడు ఏదో ఒకటి వ్రాసేయాల్సి వస్తుంది తప్పనిసరిగా! ఆ పాట వ్రాసిచ్చాక నన్ను అడిగారు “చిరుతా అంటే ఏంటండీ అక్కడ?” అని. నేను “చికితా అంటే ఏంటండీ?” అని అడిగాను. ఆ మాటకి Spanishలో అమ్మాయి అని అర్థమని చెప్పారు. అయితే “చిరుతా” అంటే Spanish-లో “చిరు తమ్ముడా” (చిరంజీవి తమ్ముడు – పవన్ కళ్యాణ్!!) అని అర్థం అన్నాను! తెలుగు పదాలిస్తే తెలుగులో వ్రాస్తాము, ఇలా పరభాషా పదాలిస్తే, hero-లు వేలు పెడితే ఇలాగే ఉంటాయి పాటలు!”

(ఈ పాట Spain లో చిత్రీకరించారు కాబట్టి ఇలా hero కోరడం సముచితమే అని కొందరు అభిప్రాయపడొచ్చు. అయితే పాట పరంగా చూస్తే ఇది అత్యుత్సాహమే!

ఇదంతా చదివి, నేను వేటూరిని వెనకేసుకు వస్తున్నాను అనుకునేరు! కాదు! తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పరిస్థితికి గీత రచయిత, దర్శకనిర్మాతలు, హీరోలూ అందరి పాత్రా ఉంది. ఇందరి మధ్యన నలిగిపోతూ సినిమా పాట సాహిత్యం బిక్కు బిక్కు మంటోందని గుర్తుచెయ్యడానికే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం లోని చాలా వివరాలు అందించిన Orkut మిత్రులు నచకి, విద్యనాథ్ గార్లకి కృతజ్ఞతలు)

వ్యాఖ్యలు (7)

కాటుక పిట్టలు

“ఉగాది” చిత్రానికి సిరివెన్నెల రాసిన ఒక పాట:

కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు
అవి నీ పైనే వాలేనేమో కొంచెం గమనించు

ఇప్పటి దాకా పరిచయమైనా లేకపోవచ్చు
అవి ఎప్పటినుంచో నీకోసమనీ చూస్తూ ఉండొచ్చు
నువు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరవచ్చు!!

అమ్మాయి కనులని “కాటుక పిట్టలుగా” వర్ణించడంలో ఎంత సౌందర్యం, ఎంత భావుకత! “రెప్పల రెక్కలు” చాచి ఆ పిట్ట ప్రియుడిపై వాలిందని అనడం లో ఎంత thought continuity. ఆహా అనిపించే భావం! సాహో అనరా విన్న జనం!!

వ్యాఖ్యలు (3)

జ్ఞాపకాలు

“రాజా” సినిమాలో “ఏదో ఒక రాగం” అనే పాట రెండు versions లో వస్తుంది. పాట పల్లవిలో వినబడే

జ్ఞాపకాలే మైమరపు
జ్ఞాపకాలే నిట్టూర్పు
జ్ఞాపకాలే ఓదార్పు
జ్ఞాపకాలే మేల్కొలుపు

అన్న వాక్యాలు ఈ రెండు పాటలకీ ఆయువు పట్టులాంటివి. జీవితాన్ని కాచి వడ బోసిన వాళ్ళు తప్ప అన్యులు ఇలాటి వాక్యాలు రాయలేరు. తలచి చూసిన కొద్దీ కొత్త కొత్త అర్థాలు స్ఫురించే ఈ వాక్యాలు విన్నప్పుడల్లా “సిరివెన్నెల” గారి ప్రతిభకి నేను స్తంభీభూతుణ్ణి అవుతూ ఉంటాను.

అభిప్రాయములు (1 )

రెండు రెళ్ళ ఆరు

“రెండు రెళ్ళ ఆరు” సినిమాలో “కాస్తందుకో దరఖాస్తందుకో” పాట లో రెండో చరణం -

ఆమె: చలి గాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా
అతను: నెలవంక దరఖాస్తు లేకుంటె చెక్కిళ్ళు, ఎరుపెక్కి పోవునా, ఎన్నెల్లు పంచునా
ఆమె: దరిచేరుతున్నా దరఖాస్తులేల?

పాటలో ఈ lines నచ్చుతాయి నాకు. ముఖ్యంగా చందమామతో నిండిన వెన్నెల రాత్రి లేక పోతే ప్రియురాలి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కి (ఆ వెన్నెల రాత్రిలో కలిగే ప్రణయ భావాల వల్ల), ప్రియుడికి ఆనందం కలిగించే chance ఉండదు కదా? అని రాయడం ఎంత చిలిపితనం!

అభిప్రాయములు (1 )

Melting winter

“ఆఖరి పోరాటం” సినిమాలో “తెల్ల చీరకు” అనే పాట చరణాలలోని lines -

వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా


కార్తీకం కలిసివస్తే నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా!!

ఎంత భావుకత? ఈ ప్రయోగాలు అన్నీ నవ్యమైనవి. ఒక mass పాటలో ఇలాటి lines రాయగలగడం వేటూరికే చెల్లింది.

ఈ పాట పాడిన “లతా మంగేష్కర్”  translation అడిగితే, “యండమూరి వీరేంద్రనాథ్” ఈ పాటని English లోకి translate చేశారుట. భావాల్లో వేటూరి చూపిన “creativity” ని లత ఎంతో మెచ్చుకున్నారుట. ముఖ్యంగా “హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా” అన్న lines ని “I am brushing your beauty with the melting winter!!” అని translate చేసి వినిపిస్తే “ఆహా” అన్నారుట.

“స్వరాభిషేకం” లో సిరివెన్నెల రాసిన “నీ చెంతే ఒక చెంచిత ఉంటే” అన్న పాట రెండో చరణంలో వినిపించే “వెచ్చని ఊహలా వెనువెంటే తరిమిన హేమంతమిది” అన్న lines వేటూరి రాసిన “వైశాఖం తరుముతుంటేనీ ఒళ్ళో ఒదుగుతున్నా” అన్న lines ని గుర్తుకు తెచ్చి, వేటూరి కి సిరివెన్నెల అర్పించిన గౌరవ నివాళి గా అనిపిస్తాయి.

వ్యాఖ్యలు (3)

Bullet!

“బుల్లెట్” అని బాపూ గారి సినిమా ఒకటి ఉంది (hero kRishnam raaju). ఈ సినిమా లో ఒక చిలిపితనం, కొంటెతనం మేళవించిన సందర్భానికి ఒక duet అవసరమైనది. సరే, వేటూరి గారు రంగంలోకి దిగారు. అలా కారులో వేటూరి వారూ, ముళ్ళపూడి వారు వెళ్తూ ఉంటే ముళ్ళపూడి situation చెప్పడం, వేటూరి పల్లవి చెప్పెయ్యడం, ఆ పల్లవి చూసి ముళ్ళపూడికి వేటూరి ముద్దు వచ్చేయడం అన్నీ జరిగిపోయాయి!! ఆ పల్లవి ఇది:

అతను: రాధ కృష్ణుడికేమిచ్చిందో ఇస్తావా మరి?
ఆమె: సీతకు రాముడేమవుతాడో అవుతావా మరి?
అతను: ముందివ్వు మరి!
ఆమె: ముందవ్వు మరి!!

ఇది చదివాకా “అవును, వేటూరి మరి” అని మనం అనుకోకుండా ఉండలేం కదా!

వ్యాఖ్యలు (2)