ఎందుకు ఎందుకు ఎందుకు

( ఈ వ్యాసం చదివే ముందు “దేవతలా నిను చూస్తున్నా” అన్న వ్యాసం చదవండి)

ఇప్పుడు సిరివెన్నెల రాసిన పాట చూద్దాం:

ఎందుకు ఎందుకు ఎందుకు
నను పరిగెత్తిస్తావెందుకు?
ఆకలి తీర్చని విందుకు
నన్నాకర్షిస్తావెందుకు?
దరికి రానీక నింగి శశిరేఖా
పొదువుకోనీక ఒదులుకోనీక
ఇంతగా చితిమంటగా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా, సౌందర్య జ్వాలా!

1. పాల నవ్వుల రూపమా
తను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా
జత చేరనీయని శాపమా
తళ తళ తళ తళ కత్తుల మెరుపై కళ్ళని పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంట కాని జంటగా నా వెంట నడవాలా?

2. నీవు నింపిన ఊపిరే
నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే
నరనరాన్ని కోస్తుంటే ఇలా
సల సల మరిగే నిప్పుల మడుగై నెత్తురి ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కదే వరమాలా
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా?

ఇందాకటి పాటతో పోలిస్తే ఈ పాటలో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారింది. శోకం అతనిని కమ్మిన ఆక్రోశంలో పుట్టిన పాట ఇది. సిరివెన్నెల తనదైన శైలిలో రాశారు – చక్కటి తేలిక పదాలూ, ఇట్టే అర్థమయ్యే గుణం, లోతైన భావం అన్నీ ఈ పాటలో చూడొచ్చు. “సౌందర్య జ్వాల”, “జంట కాని జంటగా నడవడం”, “ఒక్క పుట్టుకలో ఎన్నో మరణాలు”, “ఉరితాడుతో ఉయ్యాలలూపడం” కొన్ని గమనించదగిన ప్రయోగాలు. వాక్యాలు చదివితే అర్థమైపోతాయ్ కాబట్టి ఈ పాటకి పెద్ద వ్యాఖ్యానం కూడా అక్కర లేదు వేటూరి పాటలా.

ఈ పాటనీ, వేటూరి రాసిన “దేవతలా” పాటని పక్క పక్కన పెట్టుకుని వినడం ఒక చక్కని అనుభూతి. ఒకేలాటి సందర్భానికి ఇద్దరు కవులు, భిన్నమైన శైలిలో, భిన్నమైన ఉపమానాలతో రాయడం మనం చూడొచ్చు. “బాగా” ఎలా రాయలో కొంత నేర్చుకోవచ్చు కూడా.

ఈ రెండు పాటలకీ తగిన tune ఇచ్చిన సంగీత దర్శకుడు “విద్యాసాగర్” కూడా అభినందనీయుడే!

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

3 thoughts on “ఎందుకు ఎందుకు ఎందుకు”

  1. “తగిన ట్యూన్” అన్నారు కదా, ఇంతకంటే తగిన ట్యూన్ సాధ్యంకాదేమో అనిపించేలా చేశారు విద్యాసాగర్. ఒకేలాంటి సందర్భమే అయినా ముందుటి వ్యాసంలో మీరే అన్నట్లు తీవ్రత వేరు. ఎంత కావాలో అంత తీవ్రత వ్యక్తరపచేలా రాయగలగడం ఈ మహానుభావులకే సాధ్యం అనిపిస్తుంది. ఈ పాటలను గుర్తిస్తున్న ఇంకో మనిషున్నాడని తెలియడం చాలా సంతోషం.

  2. ఫణీంద్ర గారూ ….. మీ వివరణ చాలా బాగుంటుంది.

    కుదిరితే నిను వెతికి వెతికి (అనుమానాస్పదం), ఆనంద్ లోని యమునా తీరం, యెదలో గానం, నువ్వేనా పాటలు కూడా వివరించరా……

  3. ఆనంద్ సినిమాలో పాటల గురించి (ముఖ్యంగా యమునా తీరం) కొంత discussion జరిగింది Orkut Veturi comm లో. అది ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను.

    ఇక “నిను వెతికి వెతికి చూసి” అన్న పాట నాకు పూర్తిగా అర్థం కాలేదు (చాలా వేటూరి పాటల్లాగే!). అర్థమైతే రాస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: