రామ నవమి – సిరివెన్నెల

ఈ రోజు శ్రీ రామ నవమి. నాకు రాముణ్ణి తలచుకుంటే చప్పున సిరివెన్నెల రామ తత్త్వం గురించి, రాముని విశిష్టత గురించి రాసిన పాటలు గుర్తొస్తాయ్. “మా” TV లో ఆయన ఈ రోజు కనిపించి ఈ విషయాలు విశదీకరించారుట కూడాను!

రామాయణం గురించి గొప్ప తాత్త్విక విశ్లేషణ సిరివెన్నెల రాసిన “తికమక మకతిక” పాట (శ్రీ ఆంజనేయం సినిమాలోది). ఆ పాట గురించి నేను ఇది వరకే ఒక వ్యాసం రాసి ఉన్నాను- http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=40166&page=1

శాస్త్రి గారు కొన్ని పాటలకి చాలా versions రాస్తారన్నది తెలిసిన విషయమే. కొన్ని సార్లు ఇలా 50 versions దాకా రాసిన సందర్భాలు ఉన్నాయిట! ఇలా రాసిన వాటిల్లో దర్శక నిర్మాతలు తమకు నచ్చినది తీసుకుంటారు. అలాగే ఈ “తికమక మకతిక” పాటకి కూడ ఇంకో version ఉంది. దీని గురించి మిత్రుడు నచకి Orkut sirivennela comm లో చాలా కాలం క్రితం ఇచ్చిన వివరాలు, అతని మాటల్లోనే:

At first, guruji was in USA when Krishna Vamsi told the situation for the song. He gave one version based on the track provided by Mani Sarma. And, then, KV changed the situation again twice! appuDu inka ikkaDa unDi vraayaTam kudaradu ani India ki veLLipOyi vraasina version “tikamaka makatika…” ani (movie lO unna version).

The previous version, sung by Anjaneya addressing the God (instead of the man, as in the movie finally) is given here, thanks to my friend Vamsee:
కపికులం కపికులం మనుషుల రూపంలో
కలకలం కలకలం మనసుల మౌనంలో
కపికులం కపికులం నరుల సమూహంలో
కలకలం కలకలం భక్తి ప్రవాహంలో

సుడిగాలిలాగ రెచ్చి, గుడిలోకి తరలివచ్చి
మదిలోని బురద తెచ్చి ముదిరేటి భక్తి పిచ్చి
అది నీ పాదాలపై వదిలిందిరా దేవా…

మనిషిలో మనిషిని చూసావా దేవా?
మనసులో మురికిని భక్తని అనుకోవా?
భేరీలు పగలగొట్టి, బూరాలు ఎక్కుపెట్టి
పిలిచింది శక్తి కొద్దీ, బీభత్సమైన భక్తి
ఈ కేకల ధాటికి వైకుంఠమే దిగవా!

భజనలే చేయరా చిడతలు చేపట్టి
పూజలే జరపరా పూనకమే పుట్టి!
గుడిలోన అడుగుపెట్టి, కోరికల కూతపెట్టి
వెను తరుముంటె భక్తి గుండెల్లొ గుబులు పుట్టి
భగవంతుడే గడగడా వణకాలిరా నరుడా!

ఈ సాహిత్యం చదివితే భక్తి పేరుతో జరిగే నానా సంగతుల్ని ఒక పక్క వ్యంగ్యంగా విమర్శిస్తూనే, ఇంకో పక్క నిజమైన భక్తి గురించి చెప్పకనే చెప్పారు. మన మనసుల్లో నిండిన కపిత్వాన్నీ, మురికినీ చూపెడుతూ, అసలు మనుషుల్లో నిజమైన మనిషిని చూశావా అని దేవుణ్ణి ప్రశ్నించడం చతురంగానూ ఉంది, ఆలోచింపజేసేది గానూ ఉంది.
“రాయినై ఉన్నాను ఈనాటికి, రామ పాదము రాక ఏనాటికి?” (వేటూరి) అనడంలో రాముడు వచ్చి కాపాడాలి అనే భావం కన్నా, “నాలో మార్పు ఎప్పుడు వచ్చి రాయి రాగాలు పలుకుతుంది?” అని తనకు తాను ప్రశ్నించుకోవడమే ఎక్కువ కనిపిస్తుంది. శ్రీ రామ నవమి పర్వ దినాన ఈ ప్రశ్న మన అందరమూ వేసుకుని, కొన్ని క్షణాలైనా మనని మనం ఆలోచనల అద్దంలో చూసుకుంటే రాముడు తప్పక ఆనందపడతాడు!
 

ప్రకటనలు

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

5 thoughts on “రామ నవమి – సిరివెన్నెల”

  1. దైవత్వాన్ని గుడికి పరిమితం చేసి, రాక్షసత్వాన్ని గుండెల్లో పెట్టుకు నూరేగే మన తలతిక్కల భక్తి గురించిన చాలా గొప్ప పాట అది. (గతంలో, సాహిత్యం గుంపులోననుకుంటా, భక్తి గురించిన రసవత్తర చర్చొకటి జరిగింది.. నేటి భక్తి పోకడ గురించి అమోఘమైన వ్యాఖ్య ఇది అంటూ అక్కడ నేను ఈ పాటనే ఉదహరించాను.) తెలుగు పీపుల్ లో మీ వ్యాసం ఇప్పుడే చూసాను, చాలా బాగా రాసారు. మీ బ్లాగులో లింకివ్వకపోతే మంచి వ్యాసం మిస్సయేవాడినే! కృతజ్ఞుణ్ణి!

  2. హాయ్ ఫణీంద్ర, మీకు వున్న తెలుగు భాషాభిమానానికి జోహార్లు. మీ లాంటి తెలుగు భాషాబిమానులకు ఒక చిన్న ఐడియా ను నేను ప్రారంభించాను. అదే http://www.atuitu.com మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను, మీ కవితలను, వ్రాతలను ఇక్కడ కూడా ప్రచురించండి.
    I shall look forward to your contribution on atuitu in terms of participation and feedback.

    Cheers

    Cass

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s