సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 1

అసలు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎవరు? గొప్ప కవి అనో గొప్ప తత్త్వవేత్త అనో అంటాం మనం. కాదంటారు ఆయన!

“నాలోని కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ని మనిషి డామినేట్ చేస్తాడు”

అనే ఈ మహా మనిషిని Orkut Sirivennela Community సభ్యులతో రెండు సార్లు కలిసిన అనుభూతిని మీతో పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను. రాయాల్సింది చాలా ఎక్కువ ఉండడంతో 2-3 భాగాలుగా పోస్ట్ చేస్తాను. ఈ రాయడంలో నా స్పందన తెలపాలన్న తాపత్రయం ఉన్నా, ఆయన చెప్పిన గొప్ప మాటల్ని అందరికీ తెలియజెప్పాలన్న తపనే ఎక్కువ ఉంది. ఈ వ్యాసంలో ఆయన అన్నట్టుగా రాసిన మాటలు, ఆయన అన్నవి నాకు గుర్తున్నంతలో/అర్థమైనంతలో రాసినవని గ్రహించాలి.

అయిన వాడే అందరికీ!
సిరివెన్నెల గారిని మొదటిసారి కలిసిన ఐదు నిమిషాలలోనే – “ఈయన the great writer సిరివెన్నెల” అన్న consciousness పోయి, నా బాబయ్యతోనో మావయ్యతోనో మాట్లాడుతున్న feeling కలిగింది. సామాన్యుడిలా మనకు అందుతున్నట్టు అనిపిస్తూనే తన అసాధారణమైన మేధస్సుతో అందనట్టూ అనిపించడం – ఆయన పాట ద్వారా చెప్పాలంటే, “అయిన వాడే అందరికీ, అయినా అందడు ఎవ్వరికీ!” – సిరివెన్నెలలో చూస్తాం. మనని స్పందింపజేసే రెండో విషయం – ఆయన passion. ఆయనలోని నిజాయితీ, భావప్రకటనలో ఆవేశం,  వాగ్ధాటి, హాస్యచతురత మనని సమ్మోహితుల్ని చేస్తూనే ఉత్తేజితుల్ని కూడా చేస్తాయి. ఆయనతో మాట్లాడితే చాలు ఎవరికైనా కొత్త energy రావడం ఖాయం! మనలోని నైరాశ్యం, సందేహం మటు మాయం! ఆయన మాట కన్నా ఆయన మాట వెనుక ఉన్న ఈ శక్తి ఏదో మనని ఎక్కువ స్పందింపజేస్తుంది. ఆలోచనా పరిధి దాటి అనుభూతిలోకి మనం జారుతున్న వేళ,

“అర్థం చేసుకోవడం వేరు. అనుభూతి చెందడం వేరు”

అన్న ఆయన మాటల వెనుక అర్థం కొంత మనకి అనుభవమవుతుంది.

Echo of silence
చెప్పాల్సిన విషయం ఎంత క్లిష్టమైనదైనా చాలా తేలికగా అనిపించేటట్టు నాటకీయతా, హాస్యచతురతా, స్పష్టతా జోడించి చెప్పి, మన మనసులని సూటిగా తాకెట్టు చెయ్యగలగడం, సిరివెన్నెల ప్రత్యేకత. కొరుకుడు పడని కొబ్బరికాయని పీచు తీసి, కాయ కొట్టి, నీళ్ళు తీసి, గ్లాసులో పోసి, మనకి తాగించడం తద్వారా “తలస్నానం” చేయించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. మూడు గంటలు నేల మీద కూర్చుని వింటున్న నాకు కాళ్ళు నొప్పెట్టడం తెలియలేదంటే అది ఆయన ప్రేమగా పూసిన పలుకుల వెన్న పూతల చలువే! philosophy ఏ కాదు, philosophy చెప్పేవాడు కూడా చాలా boring గా ఉంటాడు అన్న అభిప్రాయం తప్పని ఈ తత్త్వుని చూస్తే తెలుస్తుంది. philosophy అంటే అదేదో కొరుకుడు పడని, పనికి రాని పైత్యం కాదని వివరిస్తారాయన –

“philosophy అంటే అదేదో పెద్ద విషయం కాదు. తత్త్వం అంటే nature. ప్రతి వస్తువుకీ తనదైన సహజ ప్రవృత్తి ఉంటుంది. ఈ white paper తీసుకోండి, దీనికి కొన్ని physical and chemical properties ఉన్నాయ్. అవి అర్థం చేసుకోడం తత్త్వం. అలాగే మన జీవితంలోని నవ్వునీ, బాధని, ఆశనీ, కోరికనీ అర్థం చేసుకోవడం philosophy”.

ఓహో! అనుకుని, ఆయన చెప్తున్న philosophy ని తెలుసుకోడానికి మనం సిద్ధపడేలోపే,

“మీకు తెలియంది అంటూ ఏమైనా ఉంటే అది నేను మీకు చెప్పినా తెలియదు!”

అంటూ మనకి ఒక ముడి వేస్తారు. ఆ ముడి విప్పుకునేలోపే,

“నేను చెప్పేవి అన్నీ మీకు తెలిసినవే. మీకు తట్టనివి చెప్తానేమో గాని తెలియనివి చెప్పలేను”

అని ఇంకో ముడి వేస్తారు. ఈ గజిబిజిలో మనముండగా ఒక చిరునవ్వు నవ్వి ఆయనే ఆ ముడులు విప్పుతారు –

“ఆకాశం నీలంగా ఉందనే మనకి తెలుసు. ఎందుకంటే అదే చూశాం కనుక. ఎవడో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చి, అక్కణ్ణుంచి ఆకాశాన్ని చూసి, కిందకి దిగాక ఆకాశం నల్లగా ఉంది జనులారా అన్నాడనుకోంది. అప్పటికీ మనం అతనిని నమ్మగలం గాని నిజం తెలుసుకోలేం. ఎందుకంటే మనకి తెలియంది ఎవరూ తెలపలేరు కనుక”.

హమ్మయ్యా! కొంత అర్థమవుతున్నట్టు ఉంది అని మనం అనుకుంటూ ఉంటే ఆయన ఇందాక చెప్పినదే మళ్ళీ చెప్తారు –

“కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీకు తెల్సినట్టు అనిపిస్తోంది అంటే మీకది already తెలుసు కనుకే కదా”.

అంతే! ఏదో సాక్షాత్కారం కలిగినట్టు మనకో కొత్త సత్యం బోధపడుతుంది. లెర్నింగ్ అంటే ఇదేనేమో. సిరివెన్నెల తన భావధారని కొనసాగిస్తూ –

“I am just the echo of your silence. నేనొక post master ని మాత్రమే. సందేశాన్ని చేరవేస్తున్నాను. చదువుకోగలిగేది, చదువుకోవలసింది మీరే”

అంటారు. నాకు స్వామీ వివేకానందుని మాటలు గుర్తొచ్చాయి –

“You can only water the plant. You can’t make it grow. The plant grows by itself. It is foolishness to think that you are growing the plant. Be glad that you had the opportunity to serve the plant in its growth”.

ఈ మాటల అక్షర రూపం సిరివెన్నెలలో దర్శించుకోవడం నేను పొందిన గొప్ప అనుభూతులలో ఒకటి.

అలతి అలతి పదాలతో, సరళ వివరణలతో ఆయన చెబుతున్న వాటి వెనుక ఎంతో ఆనల్పమైన, నిగూఢమైన భావాలూ, గొప్ప విషయాలూ ఉన్నాయని గ్రహించడం కష్టం కాదు. ఈ మాట ఆయనే చెబుతూ –

“సెలయేరు గల గల మంటూ రొద చేస్తూ, కొండకోనల నుంచీ దూకుతూ కవ్విస్తూ ఉంటుంది. తీరా దిగితే కాలి మడమ కూడా తడవదు. సముద్రం గంభీరంగా ఏమీ తెలియనట్టు ఉంటుంది. మరి దిగిచూస్తే?”.

అంతటి సముద్రాన్ని మథించి, సెలయేరుగా చేసి, అందులో పాటల పడవలేసి మనకోసం పంపుతున్న మహానుభావుడా సిరివెన్నెల?

(To be continued in Part 2)

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

14 thoughts on “సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 1”

 1. నీ వ్యాసంలోని కొన్ని పాయింట్లు నాకు తెలుసనేలా ఉన్నాయి. కాకపోతే అది చెప్పింది సిరివెన్నెల కాదు, కాకపోతే.. “నీకు తెలిసిన వాటినే గుర్తిస్తావు” మాత్రం నేను పొందిన గొప్ప పాఠం. ఆ గురువర్యులకి, ఇక్కడ సీతారామ శాస్త్రిగారికి, మాతో పంచుకుంటున్న మీకూ.. ధన్యవాదాలు!

 2. కొంత మందిని కలుసుకున్నప్పుడు కలిగే అనుభూతి మాటలో పెట్టడం చాలా కష్టం.కొంత మంది మాట్లడుతూ వుంటే ఏదో లోకాల్లో తిరిగి వచ్చినట్టుంటుంది.ఆలోచనలకి ఆస్కారం వుండదు.
  మీరు వీడియో తీసి వుంటే మరింత బాగుండేది.
  మీరు చెపుతున్న విధానం చాలా చాలా బాగుంది.కానీ పార్టులుగా వద్దండి.అంత ఎదురుచూడలేము 🙂

 3. స్పందనలు తెలుపుతున్న అందరికీ thanks. ఈ వ్యాసం రాయడంలో ఒక చిక్కు ఉంది – సిరివెన్నెల గారు చెప్పినది ముందు నేను అర్థం చేసుకుని తర్వాత రాయాలి. రాధిక గారన్నట్టు, ఆయన చెపుతున్నప్పుడు మంత్రముగ్ధులై వినడం, ఆ అనుభూతిలో లీనమవ్వడం తర్వాత ఏమి తెలుసుకున్నామో తెలియని పరిస్థితి నాకు ఎదురయ్యింది. అందుకే కొంత జాప్యం అవుతోంది.

  audio recording ఒకరు చేశారు. video recording చేసి ఉంటే బాగుండేది. అయితే net లో ఇప్పటికే ఆయన interviews చాలా చదివాం, videos చాలా చూశాం, గొప్ప అనుభూతి పొందాం. బాగుందనుకున్నాం. కానీ మనలో అంత మార్పు వస్తున్నట్టు లేదు. బహుశా ఆయన ఆలోచనలు (ఇవి ఆయనవి కూడా కావు, సత్యాలు) మనవి చేసుకోపోవడం వల్ల ఇది జరుగుతోందేమో. అంటే మన mind కేవలం collection చెయ్యడానికే ఇష్టపడుతోంది తప్ప, process చెయ్యడానికీ, ఒక output తేవడానికీ ఇష్టపడటలేదా? అందుకే మన knowledge ని application గా మార్చలేకపోతున్నామా?….

  వివేకానందుని ఈ quote సారం ఇదేనేమో –

  Education is not the amount of information that is put into your brain and runs riot there, undigested, all your life. We must have life-building, man-making, character-making assimilation of ideas. If you have assimilated five ideas and made them your life and character, you have more education than any man who has got by heart a whole library.

 4. Phani Garu,

  meeru ikkada aksharabaddam chesina anubhavalu nannu malli maro maaru nov 3rd varaku teesukuvellayi.

  Mee tadupari bhagalu chadavadaniki, nireekshana modalayyindi 🙂

  Naa mail ID ki meeru oka maaru mail cheste aa recordings pamputanu..Alage veelaite mee mobile number pampagalaru..

  ~Sumanoj.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: