విన్నవీ నచ్చినవీ – ఈనాడు

A Wednesday సినిమాని తెలుగులో “ఈనాడు” అన్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో పాటలు కూడా పెట్టారు (మూలంలో ఉన్నట్టు నాకు గుర్తు లేదు). కమల్ కూతురు శ్రుతి హాసన్ ఈ సినిమాకి సంగీతం అందించడం ఒక విశేషం. సగం పాటలు తనూ మరియు మన ప్రియతమ కమల్ హాసనే  (అవును! కమల్ పాడతాడని మీకు తెలియదా?) పాడ్డం జనాలకి నచ్చుతుందో లేదో మరి!  ఏదేమైనా ఈ పాటల సాహిత్యం గురించి క్లుప్తంగా –
1. పాట: ఈనాడు
రచన: వెన్నెలకంటి
సందర్భం: back ground song? టెర్రర్ కీ ఒక ముఖం ఉందని చెప్తూ సాగుతుంది.
నిజానికి ఈ పాటలో వాక్యాలు ఎక్కువ లేవు. “ఈ నాడు వచ్చాడు మనకోసం మనలో ఒకడు” అన్న వాక్యమే మొత్తం పాటంతా వినిపిస్తుంది. వెన్నెలకంటి కెరీర్ లో రాసిన అతి చిన్న పాట ఇదేనేమో!
2.  పాట: ఈనాడు ఈ సమరం
రచన: వెన్నెలకంటి
సందర్భం: ఇదీ back ground song అని అనిపిస్తోంది. సినిమాలో అన్నీ ఇలాటివే కావొచ్చు.
ఇదీ ఎక్కువ వాక్యాలు లేని పాటే. అయితే మొదటి పాటతో పోలిస్తే బెటరే. ఈ పాట కూడా తీవ్రవాదం తద్వారా జరిగే హింస గురించే –
ఎపుడో చంపే దేవతలూ
ఇపుడే చంపే మతోన్మాదులు
అన్న వాక్యాలు ఈ పాట సారంశం తెలియజేస్తాయి.
3. పాట: నింగి హద్దు
రచన: భువనచంద్ర, బ్లేజ్
సందర్భం: ఆశా గీతాలాపనలా తోస్తోంది.
ఈ పాటలో rap ఒకటి ఏడ్చింది కాబట్టి తెలుగు కన్నా ఇంగ్లీషే వినబడుతుంది. తెలుగు పదాలు అతి కష్టంగా కొంత కృతకంగా వినిపిస్తాయ్. ఉన్న తెలుగు వాక్యాలు ఒకటో రెండో. కాబట్టి పెద్ద చెప్పుకోడానికి ఏమీ లేదు.
4. పాట: అల్లా జానే
రచన: వేటూరి
సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్థితులని వివరించే పాట
మొత్తం సినిమాలో తెలుగు లిరిక్ ఎక్కువున్న పాట ఇదే. వేటూరి బాగా రాశారని అనిపించింది –
వేదన తిరిగే వీధులు చూడు
గుమ్మాలన్నీ ఏడ్చెను నేడు
వేటూరి imagery ని బాగా వాడతారని తెలిసిందే కదా (ఆ imagery మనకి అర్థం అవుతుందా లేదా అన్నది పక్కన
పెడితే!). ఇక్కడా అది కనిపిస్తుంది –
పిల్లలు జడిసే నాట్య పిశాచం
వెన్నెల మింగే పున్నమి భూతం
గోడల గొంతున మృతుల రోదనం
దిశలే పగిలే దీనాలపనం
ఒక్కసారి ఊహించుకోండి. పై వాక్యాలు పూర్తిగా అర్థం కాకపోయినా (అసలే అర్థమే లేకపోయినా!) ఏదో దిగులు లాటి ఫీలింగ్ కలుగుతుంది. దటీజ్ వేటూరి!
5. పాట: అల్లా జానే (Remix)
రచన: వేటూరి
సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్తుథలని వివరించే పాట
పై పాట కమల్ పాడితే ఈ పాట శ్రుతి హాసన్ పాడింది. remix అన్న మాట. ఇందులో “వినాయక” అని వినిపిస్తుంది. ఇందాక పాటలో “అల్లా” అన్నారు కాబట్టి ఇక్కడ “వినాయక” అన్నారేమో మరి!!
ఈ పాటలు streaming audio లో ఇక్కడ వినొచ్చు –  http://www.ragalahari.com/newreleasesdetail.asp?newmvname=Eenaadu

A Wednesday సినిమాని తెలుగులో “ఈనాడు” అన్నారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో పాటలు కూడా పెట్టారు (మూలంలో ఉన్నట్టు నాకు గుర్తు లేదు). కమల్ కూతురు శ్రుతి హాసన్ ఈ సినిమాకి సంగీతం అందించడం ఒక విశేషం. సగం పాటలు తనూ మరియు మన ప్రియతమ కమల్ హాసనే  (అవును! కమల్ పాడతాడని మీకు తెలియదా?) పాడ్డం జనాలకి నచ్చుతుందో లేదో మరి!  ఏదేమైనా ఈ పాటల సాహిత్యం గురించి క్లుప్తంగా –

eenaadu

1. పాట: ఈనాడు

రచన: వెన్నెలకంటి

సందర్భం: back ground song? టెర్రర్ కీ ఒక ముఖం ఉందని చెప్తూ సాగుతుంది.

నిజానికి ఈ పాటలో వాక్యాలు ఎక్కువ లేవు. “ఈ నాడు వచ్చాడు మనకోసం మనలో ఒకడు” అన్న వాక్యమే మొత్తం పాటంతా వినిపిస్తుంది. వెన్నెలకంటి కెరీర్ లో రాసిన అతి చిన్న పాట ఇదేనేమో!

2.  పాట: ఈనాడు ఈ సమరం

రచన: వెన్నెలకంటి

సందర్భం: ఇదీ back ground song అని అనిపిస్తోంది. సినిమాలో అన్నీ ఇలాటివే కావొచ్చు.

ఇదీ ఎక్కువ వాక్యాలు లేని పాటే. అయితే మొదటి పాటతో పోలిస్తే బెటరే. ఈ పాట కూడా తీవ్రవాదం తద్వారా జరిగే హింస గురించే –

ఎపుడో చంపే దేవతలూ

ఇపుడే చంపే మతోన్మాదులు

అన్న వాక్యాలు ఈ పాట సారంశం తెలియజేస్తాయి.

3. పాట: నింగి హద్దు

రచన: భువనచంద్ర, బ్లేజ్

సందర్భం: ఆశా గీతాలాపనలా తోస్తోంది.

ఈ పాటలో rap ఒకటి ఏడ్చింది కాబట్టి తెలుగు కన్నా ఇంగ్లీషే వినబడుతుంది. తెలుగు పదాలు అతి కష్టంగా కొంత కృతకంగా వినిపిస్తాయ్. ఉన్న తెలుగు వాక్యాలు ఒకటో రెండో. కాబట్టి పెద్ద చెప్పుకోడానికి ఏమీ లేదు.

4. పాట: అల్లా జానే

రచన: వేటూరి

సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్థితులని వివరించే పాట

మొత్తం సినిమాలో తెలుగు లిరిక్ ఎక్కువున్న పాట ఇదే. వేటూరి బాగా రాశారని అనిపించింది –

వేదన తిరిగే వీధులు చూడు

గుమ్మాలన్నీ ఏడ్చెను నేడు

వేటూరి imagery ని బాగా వాడతారని తెలిసిందే కదా (ఆ imagery మనకి అర్థం అవుతుందా లేదా అన్నది పక్కన

పెడితే!). ఇక్కడా అది కనిపిస్తుంది –

పిల్లలు జడిసే నాట్య పిశాచం

వెన్నెల మింగే పున్నమి భూతం

గోడల గొంతున మృతుల రోదనం

దిశలే పగిలే దీనాలపనం

ఒక్కసారి ఊహించుకోండి. పై వాక్యాలు పూర్తిగా అర్థం కాకపోయినా (అసలే అర్థమే లేకపోయినా!) ఏదో దిగులు లాటి ఫీలింగ్ కలుగుతుంది. దటీజ్ వేటూరి!

5. పాట: అల్లా జానే (Remix)

రచన: వేటూరి

సందర్భం: తీవ్రవాదం అలముకున్న దేశ పరిస్థితులని వివరించే పాట

పై పాట కమల్ పాడితే ఈ పాట శ్రుతి హాసన్ పాడింది. remix అన్న మాట. ఇందులో “వినాయక” అని వినిపిస్తుంది. ఇందాక పాటలో “అల్లా” అన్నారు కాబట్టి ఇక్కడ “వినాయక” అన్నారేమో మరి!!

ఈ పాటలు streaming audio లో ఇక్కడ వినొచ్చు – ragalahari

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s