నీ ప్రశ్నలు నీవే!

ఉత్తమ సాహిత్యం ఎప్పుడూ పాఠకుడికి సూటిగా వెళ్తుంది, ఎవరి వ్యాఖ్యానం అవసరం లేకుండా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ గీతాలు ఈ కోవకే చెందుతాయి. అందుకే ఈ బ్లాగులో ఆయన పాటలపై వివరణలు తక్కువ కనిపిస్తాయ్. అయినా ఒక్కో సారి సిరివెన్నెల పాటలకీ వ్యాఖ్యానం అవసరం అవుతుంది. ఈ మధ్య కాలంలో నాకు ఇలా అనిపించిన పాట “నీ ప్రశ్నలు నీవే” (కొత్త బంగారు లోకం సినిమా). నిజానికి ఈ పాటలో అంత క్లిష్టత లేదు. చాలా వరకూ అర్థమైపోతూనే ఉంటుంది. అయినా కొంత వివరణ ఇద్దామని ఈ వ్యాసం.

ఈ పాట గురించి Orkut Sirivennela కూటమిలో లో మంచి చర్చ జరిగింది – Orkut – నీ ప్రశ్నలు నీవే . అందులో చాలా మంచి విశ్లేషణలు చేసి, ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ ఇచ్చిన వీరికి ముందుగా నా ధన్యవాదాలు: అన్న నచకి (పాట picturization గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు. అది పై లింకులో మీరు చదవొచ్చు), వెంకట్ గారు (కొన్ని విషయాలు సిరివెన్నెల గారినే అడిగి clarify చేశారు), శైలజ గారు (కొన్ని చక్కటి వివరణలు).

ప్రేమలో పడిన పడుచు జంట ఇంట్లో నుంచీ పారిపోదామని నిర్ణయించుకున్న సందర్భంలో వచ్చే background song  ఇది. దీనికి మాములుగా సాహిత్యం రాయడం కష్టం కాదు. అయితే decision making గురించీ, maturity గురించీ, జీవిత సత్యాల గురించీ చెప్పే పాటగా మలచాలంటే ఒక సిరివెన్నెల కావాలి. పాటల్లో పాఠాలు నేర్పే మేస్టారూ, మెగా స్టారూ ఆయనే కదా మరి.

failure

ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం రాయడానికి సరిపోయే విషయాలున్న ఈ పాటలోని పాఠాలని ఒక సారి పరికిద్దాం:
Take Responsibility
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
చాలా సమస్యల్లో క్లిష్టత నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. ఊరికే వదిలిస్తే సమస్యలు వాటంతట అవే తీరి పోతే బాగుండేది. కానీ చాలా సమస్యలు ఇలా దారికి రావు. కాబట్టి మనకున్న భయాలని, ఆందోళనలని పక్కన పెట్టి సమస్యని ఎదురుకోక తప్పదు. పక్కవాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు కానీ మనకేం కావాలో మనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే “తప్పించుకు పారిపోకు, ఆగిపోకు, నీ సమస్యని నువ్వే సాధించాలి” అని కర్తవ్య గీతను మరో శ్రీ కృస్ణుడై బోధిస్తున్నారు సిరివెన్నెల.
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
అమ్మైనా సరే సాధారణంగా తొమ్మిది నెలలు మోస్తుంది, మహా అయితే పది నెలలు. అంతే. తర్వాత నువ్వు అమ్మ నుండి విడిపడాల్సిందే. నీకు నువ్వుగా ఎదగాల్సిందే. అలాగే పూలకొమ్మ పూలని తనతోనే ఉంచుకోదు. గుడికో, జడకో పంపించి నీ పరిమళాన్ని నువ్వే పంచుకో, నీ పరమార్థాన్ని నువ్వే చేరుకో అని చెప్తుంది. సినిమా పరంగా చెప్పాలంటే యువ జంటకి – “మీరు చిన్న పిల్లలు కారు..ఎదిగిన వాళ్ళూ, తెలిసిన వాళ్ళు. మీరే తేల్చుకోండి”  అని హితబోధ చేస్తున్నరు సిరివెన్నెల.

ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం రాయడానికి సరిపోయే విషయాలున్న ఈ పాటలోని పాఠాలని ఒక సారి పరికిద్దాం:

Take Responsibility

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

చాలా సమస్యల్లో క్లిష్టత నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. ఊరికే వదిలిస్తే సమస్యలు వాటంతట అవే తీరి పోతే బాగుండేది. కానీ చాలా సమస్యలు ఇలా దారికి రావు. కాబట్టి మనకున్న భయాలని, ఆందోళనలని పక్కన పెట్టి సమస్యని ఎదురుకోక తప్పదు. పక్కవాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు కానీ మనకేం కావాలో మనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే “తప్పించుకు పారిపోకు, ఆగిపోకు, నీ సమస్యని నువ్వే సాధించాలి” అని కర్తవ్య గీతను మరో శ్రీ కృస్ణుడై బోధిస్తున్నారు సిరివెన్నెల.

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

అపుడో ఇపుడో కననే కనను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

గుడికో జడకో సాగనంపక ఉంటుందా

అమ్మైనా సరే సాధారణంగా తొమ్మిది నెలలు మోస్తుంది, మహా అయితే పది నెలలు. అంతే. తర్వాత నువ్వు అమ్మ నుండి విడిపడాల్సిందే. నీకు నువ్వుగా ఎదగాల్సిందే. అలాగే పూలకొమ్మ పూలని తనతోనే ఉంచుకోదు. గుడికో, జడకో పంపించి నీ పరిమళాన్ని నువ్వే పంచుకో, నీ పరమార్థాన్ని నువ్వే చేరుకో అని చెప్తుంది. సినిమా పరంగా చెప్పాలంటే యువ జంటకి – “మీరు చిన్న పిల్లలు కారు..ఎదిగిన వాళ్ళూ, తెలిసిన వాళ్ళు. మీరే తేల్చుకోండి”  అని హితబోధ చేస్తున్నరు సిరివెన్నెల.

Life is difficult

బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా

ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

జీవితం పూల బాట కాదు. ఇది తెలిసిందే అయినా, ప్రేమ మత్తులో పడిన పడుచు జంటకి గుర్తు చెయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మత్తులో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వాళ్ళ ముందు జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆచితూచి అడుగు వెయ్యమని బోధన.

Real intelligence is knowing how to use intelligence

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?

గతముందని గమనించని నడిరేయికి రేపుందా?

గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?

తెలివీ, తర్కం మనిషికున్న గొప్ప వరాలు. ఇవి Tools లాటివి. వాడాల్సిన చోట, వాడాల్సిన పద్ధతిలో వాడితే ప్రయోజనం పొందుతాం.  “తర్కం అన్నది అన్ని వైపులా పదునున్న కత్తి. మనం ఎందుకు వాడుతున్నాం అనే ప్రశ్న మీద తర్కం యొక్క లక్ష్యం చేధించబడుతుంది” అని చెబుతూ సిరివెన్నెల తన ఒక పాత కవితలో ఇలా రాశారు –

తర్కం ఒక ఆట

ఒక కెలిడియోస్కోప్

మేధోమథనమే దాని లక్ష్యమైతే

తర్కం ఒక బాట

ఒక దూరదర్శిని

సత్యాన్వేషణే దాని లక్ష్యమైతే

తర్కాన్ని ఆటగా వాడడం అంటే మనకి నచ్చిన దానికి సమర్థనగా లాజిక్కులు తియ్యడం – “అలలు లేని కడలి లేదు, అలాగే అలజడి లేని మనసు లేదు. కలలు లేని కనులు లేవు.” అంటూ intermediate చదివే కురాడు తన ప్రేమని సమర్థించుకోవడం ఈ కోవకే చెందుతుంది. అందుకే వెలుగుని చూపే, గమ్యన్ని చేర్చే బాటగా  తర్కాన్ని వాడాలి అని సుతిమెత్తగా సూచిస్తున్నారు.

Define your success

వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.

గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?

Clarity అన్నది జీవితంలో చాలా ముఖ్యం. మనం ఏమి సాధించాలో తెలియకపోతే ప్రతి అల్పమైనదీ గెలుపులాగే అనిపిస్తుంది. వయసులో ఉన్న యువ జంటకి ప్రేమే గొప్ప గెలుపు అనిపిస్తుంది అది సుడిలో పడదోసే నావ అయినా సరే. అందుకే ఇక్కడ సిరివెన్నెల – “తెలివిని వాడండి. మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. తెలిసీ తప్పటడుగులు వెయ్యకండి” అని చెప్తున్నారు.

Lost moment is lost forever

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?

ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?

మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..

కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??


కాలం మనపై ప్రేమ కురిపిస్తూ, రోజూ గోరు ముద్దలుగా ఒకొక్క జీవిత సత్యాన్నీ తినిపిస్తూ కూర్చోదు. మనకే ఆ జాగ్రత్తా, స్పృహా, తెలివీ ఉండాలి. సినిమాలో హీరో తన తండ్రిని కోల్పోతాడు. కొంత పశ్చాత్తాపం కలుగుతుంది. సూర్యుడు ఉన్నప్పుడు అతని విలువని గ్రహించక రాత్రి అయ్యి చీకటి పడ్డాక తెలుసుకుంటే పెద్ద ప్రయోజనం లేదు. అయితే మళ్ళీ వెలుగు వస్తుంది కాబట్టి ఈ సారైనా తెలివి తెచ్చుకుని మసలడం చెయ్యాలి.

Learn from history

కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!

అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.

తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???

ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!!

గత చరిత్రనీ, మన అనుభవాలని ఒక సారి తరచి చూసుకోవడం అవసరం. ఎందుకంటే అవి మనం చేసిన తప్పుల్ని, మన అసమర్థతల్ని, మన సత్తాలనీ చూపెడతాయి కనుక. మనం ముందు వెయ్యబోయే అడుగులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంత వివరిస్తాయి కనుక. మనం చరిత్రని తిరగ రాయాలనుకున్నా కూడా ఇప్పటికే రాసి ఉన్న చరిత్రని చదవడం అవసరం! ఇది విస్మరించి ప్రపంచంలో మాదే ప్రత్యేకమైన ప్రేమ జంటా, మాది అమర ప్రేమ, లేక అద్భుత ప్రేమ అనే బ్రాంతిలో మునుగుతూ ఉంటే చివరికి మునకే మిగులుతుంది. ఒక్క సారి ప్రేమ పేరుతో పడదోసిన పాత కథలనీ, ప్రేమ వల్ల రగిలిన చితులని స్మరించుకుంటే ఇలా ముందు వెనకలు చూడకుండా ఉరికే వలపు పరుగులు కుదుట పడతాయ్. అప్పుడు  ప్రేమికుల జీవితాలూ, తల్లిదండ్రుల హృదయాలూ కూడా నవ్వుకుంటాయ్. కన్ను కొట్టే జాబిల్లీ, వెన్నెల రగిల్చే విరహాలూ, దోబూచులాడే చుక్కలూ…వీటిని అన్నింటినీ కూడా అప్పుడు దర్జాగా అనుభూతి చెందొచ్చు!!

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

41 thoughts on “నీ ప్రశ్నలు నీవే!”

  1. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
    గుడికో జడకో సాగనంపక ఉంటుందా

    -> asalaaa kommaki choice unda tanadi anadaniki leka aapadaniki …yevaro kostaru pampistaru…(just saaganaputhundi ani vadaru …kani ikkada komma ki pooyinchatam varake telusu???????

    alaage parents kooda neevu nee istamaina daarilo velthunte maarcha leru … only u hv to choose right path.!

    komma saaga nampatam entha nizamO , parents kooda anthE [:)] ..puvvu ki leni power person ki undi ..so he should answer to his own questions?????

    1. పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

      అపుడో ఇపుడో కననే కనను అంటుందా

      ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

      గుడికో జడకో సాగనంపక ఉంటుందా

      – ఈ వాక్యాలకి మీరు చేసిన interpretations లాటివి నాకూ తోచాయ్. నిజానికి ఈ వాక్యాలకి అర్థం స్పష్టంగా ఉన్నా, కవి చెప్పాలనుకున్న అన్వయం అంత స్పష్టంగా లేదు. కాబట్టి మీ interpretation కూడా కరెక్టే, నేనూ కరెక్టే!

    2. పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

      అపుడో ఇపుడో కననే కనను అంటుందా

      ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

      గుడికో జడకో సాగనంపక ఉంటుందా

      – ఈ వాక్యాలకి మీరు చేసిన interpretations లాటివి నాకూ తోచాయ్. నిజానికి ఈ వాక్యాలకి అర్థం స్పష్టంగా ఉన్నా, కవి చెప్పాలనుకున్న అన్వయం అంత స్పష్టంగా లేదు. కాబట్టి మీ interpretation కూడా కరెక్టే, నేనూ కరెక్టే!

  2. కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!

    అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.

    here I get completely opposite to yours!

    there are many failed cases (కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!)..but your present and future issues could not see them(అని తిరగేశాయా చరిత పుటలు) ( he can seee if he sit idle, but not his fate/day to day new challenges/issues( వెనుజూడక ఉరికే వెతలు.))…

  3. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???

    ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!!

    writer is not interested stories like lyla majnu, devadas..

    he want lovers has no need to let know such memories/tragedies to coming generations .

    so do not ignore any one (may be parents) to become part of history !!!

    1. మీరన్నది నాకు పూర్తిగా అర్థం కాలేదు! కానీ నేను తోచిన అర్థం ఇది – “వెనుచూడకుండా ఉరుకుతున్న వెతలు, కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అన్న ప్రశ్నలకి చరిత్రలో సమాధానం వెతికాయా?”. ఈ ప్రశ్న అడుగుతున్నాడు కవి. సమాధానం “లేదు” అని. ఇలా ప్రశ్నించుకోకపోవడం వల్ల, గతంలో ప్రేమికులు చేసిన తప్పులే మళ్ళీ చేసి విషాదంగా మిగులుతున్నారు అని భావం.

      1. meeru ikkada straight ga chepparu ,

        inka

        ———————–

        “వెనుచూడకుండా ఉరుకుతున్న వెతలు, కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అన్న ప్రశ్నలకి చరిత్రలో సమాధానం వెతికాయా?”.
        ——————————

        lo chinna change

        కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అన్న ప్రశ్నలకి “వెనుచూడకుండా ఉరుకుతున్న వెతలు” చరిత్రలో సమాధానం వెతికాయా?”.

        or

        “వెనుచూడకుండా ఉరుకుతున్న వెతలు” కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అన్న ప్రశ్నలకి చరిత్రలో సమాధానం వెతికాయా?”.

        ani ardham chesikovali.

    2. మీరన్నది నాకు పూర్తిగా అర్థం కాలేదు! కానీ నేను తోచిన అర్థం ఇది – “వెనుచూడకుండా ఉరుకుతున్న వెతలు, కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అన్న ప్రశ్నలకి చరిత్రలో సమాధానం వెతికాయా?”. ఈ ప్రశ్న అడుగుతున్నాడు కవి. సమాధానం “లేదు” అని. ఇలా ప్రశ్నించుకోకపోవడం వల్ల, గతంలో ప్రేమికులు చేసిన తప్పులే మళ్ళీ చేసి విషాదంగా మిగులుతున్నారు అని భావం.

  4. వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.

    గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

    సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?

    first line is easy to understand as its situational part ….

    2nd line … the boy and girl thinks they win on their troubling parents by going away or ignoring them….. its just their assumption …there is nothing to say u r successful as you have further challenges based on what u did today …:)

    3rd line writer asks to listen at others failures before acting….which is very important to life …

    it goes back to first line వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది. but listen to others failure who went on same path 🙂 ( illu vadili velladam leka college lo enjoy cheyyadam ..leka office lo fun kavachu what ever )

  5. వయసులో ఉన్న యువ జంటకి ప్రేమే గొప్ప గెలుపు అనిపిస్తుంది అది సుడిలో పడదోసే నావ అయినా సరే.

    okkokkasari ..chadivithe, inkaaa chooste ardham ayinatlu anipistundi kani

    vinnappudu maaripothundi …so I took audio as priority ….

    vedio lo peddaga info ledu ..endukante …వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది lantivi tappa other lines are pointing to life in genaral…

      1. వయసులో ఉన్న యువ జంటకి ప్రేమే గొప్ప గెలుపు అనిపిస్తుంది అది సుడిలో పడదోసే నావ అయినా సరే.

        ani rasaru meeru …idi mee swantha bhavam ( correcte ayina) …and lyrics ki match avvadu .

        గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

        సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?

        సుడిలో పడదోసే నావ అయినా సరే ani meeru ante dwanda ardaalu vastayi, yevaraina sudilO padu naava ani telisi ayina sare gelupu anukoru … 🙂

        kavi సుడిలో పడు ప్రతి నావ ni observe cheyyamantunnadu …

        these 2 lines need to be taken separately ,

        meeru konthavaraku sirivennela bhavavesam ki meeru lonu ayyi ( aa mood lo) vrasaru .. nizaniki sirivennela oka lyricyst matrame ..akkada story ki kavalasinadi rastaru ..tana personal opinions avvalani ledu .he did his job..

        Sirivennela matlade prati line/speech correct avvalani ledu ante oppukogalara? ( not abt this song.)

        sorry mee interpretation kavini batti undatam panti krinda rayilaga anipistondi.

    1. ఒప్పుకుంటాను! కొంత సరదా కోసం రాశాను. ఇవన్నీ భావ కవులు చెప్పినవి. practicalities విస్మరించకుండా, సవ్యంగా ప్రేమ సాగితే ఇవన్నీ తర్వాత తీపి గురుతులుగా మిగిలిపోతాయ్. లేకపోతే నిట్టూర్పుగా స్మృతిలో మిగిలిపోతాయ్. “జ్ఞాపకాలే మైమరపూ, జ్ఞాపకాలే నిట్టూర్పూ” అని సిరివెన్నెల గారే అన్నారుగా!

      1. గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

        ani antoonE సవ్యంగా ప్రేమ సాగితే ani antunnaru 🙂

        yedi savyam ani prove cheyyagalama? cheyyagaligithe ee song avasaram ledu ….

        to explain you more, ee movielo aa ammayi ni yevaro hero kosam protect chesaru …ala avvalani ledu ..hero vellaka povadam valla inkedaina jarigi aame ki troubles vachi undavachu …leda vallu vellipovalani decision teesikokunda intlone unte , aa ammayiki forciable marriage chesi undochu ..and aame happy ga / un happy ga undi undavachu …

        leka aa ammayi decision marchu kone back ki velli undavachu ..ayina hero forgot some thing so he went back home to collect…otherwise he would have left the house permanantly ….

        ala velladam valla nastam jarigeda leda anadaniki
        సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..? antunnadu kavi …

        kani kavi matram vinnada???? ( if I can talk abt his personals he discontinued his medicine course sine he could not enjoy it …he could efford it as his family is wealthy enough to bare his decision to that time ) … not sure he wanted to have a career in films …so గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

        ila genaral vi include cheste lyric ki antham undadu …asalu bhavam ni miss avuthamu

  6. కన్ను కొట్టే జాబిల్లీ, వెన్నెల రగిల్చే విరహాలూ, దోబూచులాడే చుక్కలూ…వీటిని అన్నింటినీ కూడా అప్పుడు దర్జాగా అనుభూతి చెందొచ్చు!!

    writer drushti lo ivvanni trash … ivvanni mee oohalu 😛

    1. ఒప్పుకుంటాను! కొంత సరదా కోసం రాశాను. ఇవన్నీ భావ కవులు చెప్పినవి. practicalities విస్మరించకుండా, సవ్యంగా ప్రేమ సాగితే ఇవన్నీ తర్వాత తీపి గురుతులుగా మిగిలిపోతాయ్. లేకపోతే నిట్టూర్పుగా స్మృతిలో మిగిలిపోతాయ్. “జ్ఞాపకాలే మైమరపూ, జ్ఞాపకాలే నిట్టూర్పూ” అని సిరివెన్నెల గారే అన్నారుగా!

      1. ఇవన్నీ భావ కవులు చెప్పినవి. practicalities విస్మరించకుండా, సవ్యంగా ప్రేమ సాగితే ఇవన్నీ తర్వాత తీపి గురుతులుగా మిగిలిపోతాయ్. లేకపోతే నిట్టూర్పుగా స్మృతిలో మిగిలిపోతాయ్. “జ్ఞాపకాలే మైమరపూ, జ్ఞాపకాలే నిట్టూర్పూ” అని సిరివెన్నెల గారే అన్నారుగా!

        ‘premalE badhalu’ ani maa tAtayya koodaa annaru ..ante badhalu lekunda undalante premalu ku dooram ga undali anaaa? (any relation) …andariki ee neethi cheppE aayana tana premalu matram compromise kaledu hi hi …and aayana andariki cheppe time lo aayana tanu badha padatam konchem kooda tagginchu koledu 😀

        kabatti ee lyric ni bhava kavithvaniki dooram ga unchamani manavi 😛

        ఇవన్నీ భావ కవులు చెప్పినవి. practicalities విస్మరించకుండా,

        ‘bhava kavithvam’ lo ‘practicalities’ gurinchi meeru explain cheste vinalani undi 😛 😛 ..

  7. Phani garu …

    Ikkada song ki meeru pettina pic baagundi….ee person ki problem love ayyundadu …kani prathi line athaniki varthistundi ….pls do not take ny of my comments in person.

    inka ee lyrics sirivennela rasaru kabatti intha baruvaina explanations vastunnayemo ( sorry ..chinna doubt) ..nizaniki chala simple song idi with lots of human values.

    nigga deesi adugu tarvatha aayana patallo naaku nachina song idi ..inka yevaro okaru yepudo apudu ..( inkem gurthu ravatam ledu )

    1. మల్లీశ్వరి గారూ,

      ఎప్పటిలాగే కొత్త కోణాలని చూపించే నీ comments కి ధన్యవాదాలు. నిజమే! ఈ పాటని simple పాటగా తీసుకోవచ్చు, లేదా జీవిత సత్యాలు బోధించే గొప్ప పుస్తకంగా తీసుకుని ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. ఇలా ఇన్ని రకాలుగా అనిపించేలా రాయగలగడం కూడా ప్రతిభే! మీకు ఈ పాట నచ్చినందుకు సంతోషం!

      1. నిజమే! ఈ పాటని simple పాటగా తీసుకోవచ్చు, లేదా జీవిత సత్యాలు బోధించే గొప్ప పుస్తకంగా తీసుకుని ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు.

        hmm nenu already lot of human values unnayi ani cheppanu…adi chaalu kadaa….

        tarkam loki velthe, asalu jeevitha satyalu motham enni? vanilo ennitine ee song cover chestundi leda touch chestundi?

        ye jeevithanni ayina anvanche oka bhavaniki pustakam vrayagalara?????

        is it what the difference betwn Bhava kavitvam ( 100 pages) and practicality ( 1 page) ? ( vithanda vaadam kaavachu …kani oka vaadam :))

        oka pagi paatani ardham chesikogalgithe100 pegila pustakam enduku ?

        okkokka line ki oka 10 pages vrayagalara? okka sentense lo cheppalera?????

        bhava

    2. మల్లీశ్వరి గారూ,

      ఎప్పటిలాగే కొత్త కోణాలని చూపించే నీ comments కి ధన్యవాదాలు. నిజమే! ఈ పాటని simple పాటగా తీసుకోవచ్చు, లేదా జీవిత సత్యాలు బోధించే గొప్ప పుస్తకంగా తీసుకుని ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. ఇలా ఇన్ని రకాలుగా అనిపించేలా రాయగలగడం కూడా ప్రతిభే! మీకు ఈ పాట నచ్చినందుకు సంతోషం!

      1. ఎప్పటిలాగే కొత్త కోణాలని చూపించే నీ comments కి ధన్యవాదాలు.

        thank you 🙂 ..

        nizaniki meeru post chese varaku ye song lyrics enti anevi naku telidu,,basic ga mee lanti vallu highlight cheste chadavadame ( meeku sirivennela chepte gamaninchi natlu.. 😛 ..just teasing…but i mean it )..meaning kooda peddaga telidu ane cheppali …

        so I donno making the product ( interpretation) …I just start my first comment unconsiously incase any thing puzzling…so oka order lo cheppalEnu…but i will try to be organised incase any in future 🙂

      2. meeru pustakam ante KV teesina cinima (jagamantha kutumbam ki) gurthu vastundi …

        aaa paata vinadaniki bavuntundi …100 ardhalu unnayi ani meeru antaru ..kani oka ardham kosam rasinadi kaadu …genaral ga aavesam vachinappudu yedo raasukonnaru ayina … prathi line ki goppa meaning undalani ledu …avasaraniki prasaki vada vachu …

        kani papam sirivennela aa paataki ardham cheppalsi vachindi( goppaga kanipistundi kaani, nizaniki on its own yevariki ardham kaaledu …naa comment enti ante ikkkada, Sirivennela interpretation vedio choosaaanu..aayane cheppaleka yedo cover chesinatlu undi ….aayana matallo chala lopalu kanipinchayi…mari director ki em ardham ayyindi yem movie teesadu ??? so it failed…

        sirivennala kosam, vidhatha talapuna vadaru kaani …vidhata talapuna kosam sirivennela teeste adi kooda chkramE ayyedi.

        vidhata talapuna anedi adbhuthamain kavi yokka oohaaa …aa song ki award iste ooha ki award ichinatlu kani nizaniki kaadu …sari mari aa ooha yokka upyogam samajaniki enti …just bhavaa aanandamu kAdA….:) ..nandi award vachindi kaddaaa…adi cinimaa artists ki iche award kabatti vachindi ..aaa proyoganiki ichina abhinandana….samara simha reddy ki kooda nandi award vachindi ….action baagundi ani …anthe ..vaniki national awards raavu.

        goppa paata paina ..random ga comment chestunnanu …aalochinchi kaadu …nenu kooda sirivennela abhimaanini …..kani lyricyst ga no, good human being ano ani nenu anukonu…asalu paatalu choodani nenu ippudu yekkado meaning telisi malli choostunnanu…ilage ee review choosi okasari you tube lo vinnanu …:)

        aayana career kosam tanu padina srama … oka duet ni duet gane vraste aayana innallu nilichevaru kaadu …endukante aa flow lo aayanaki rayadam raadu…kaabatti konni values choopinchali duets lo koodaa …it’s his need (100% correct kakapovachu…but kontha varaku)

        inkaa aayana speaches antaraa….andaroooo yEdi anukontaro avi aayana matladaru (telisinde kadaa enduku)….inko angel cheptharu …yedi correct anedi yevvariki telidu (including him) ..its just another angle …(okkokkariki suit ayithe/labham unte use chesiko vachu..as simple as that)

        meeku telisinde nenu cheptha ani mundu cheppadam valla, telisinatlu anipistayemo …

        leka pothe manamu inni nerchukonnamu …modata yemi teliyadu kadaa 🙂

        maa sir okayana anevaru …residential schools merit students ni teesikelli baagu chesedemundi ….30% marks vache vallani 45 % vachela cheppamanadi vallani ani (ante govt entrance petti scree chestundi kadaa) …nannu baga abhimaninche aayana congrats cheptharu anukonte alanti school ki vella dalachu konnanduku nannu, alaa toppers ki matrame fecility annanduku school ni dummethi posaaru 🙂

        manam argue cheyyavachu, chaduvu vachina vallake chaduvu cheppagalamu ani …alage meeku already anni telusu anukonte aayana cheppe avasaram ledu …cheppaka mundu vadilesi natle, cheppina taruvaatha kooda …konnallaki automatic ga marchi pothamu …kabatti naaku teliyandi, avasaramainadi yemanna chepthe santhoshistanu 😦 …

        does it makes any sense???? donno

  8. ఇలా ఇన్ని రకాలుగా అనిపించేలా రాయగలగడం కూడా ప్రతిభే!

    kaademo ani naa moddu burra ki anipistundi ..inni rakalu ga aaalochinche manam undatam valla adrustam ( business ki) …viswanadh garu casual ga pettinna scenes ki 100 bhavalu feel ayyi murisipoyina vallamu manamu ..aayana simple ga chepparu adi asalu antha importance unna scene kaadu annaru kadaa…

    vallu valla business kosam vrastaru … alakaadu abhiruchi unna kavi antara…aa movie producer ki , director ki valla business ki eeyana suit avutharu anthe ….

    Mallanna director anni message unna cinimale teestadu …adi abiruchi kaadu …athaniki andulo labham kanapadindi ….ippudem chestaadO?

    alaage migathavi sirivennela ki rayadam raadu ….

    btw aayanaki migatha songs ki award enduku raledu …ee song enduku vachindi ante chala mandi politics antaru ….kani award ki select ayyina song choosaka naku mundu vaniki award ivvadam enduku? ani pinchindi….awards rani songs ki enduku raledo discuss chese / aaalochinche fairness inka raledu .. I feel it ..

  9. సవ్యంగా ప్రేమ సాగితే ఇవన్నీ తర్వాత తీపి గురుతులుగా మిగిలిపోతాయ్. లేకపోతే నిట్టూర్పుగా స్మృతిలో మిగిలిపోతాయ్.

    antha mana manchike antaaru kadaaa…so if we miss some thing, it means there is some thing big is in waiting kaadaaa?

    entO ….kshaminchaali mimmalni tease chestunnano, naa doubts aduguthunnano teliyadam ledu …I mean it to each of your lines only….

  10. @Phani

    during my comments finally i thought why people in community had not one thread to criticise sirivennela (vimarsha)…

    so before asking that some on in my friend list wanted to check the topics, luckily I saw your these lines :

    ————————————————————–

    By Phani at Orkut : What I feel and notice is that we have started to eulogize Sirivennela to such an extent that we feel he is perfect. This cult following of him some times scares me because eventually such a following will have a biggest short coming – it stops with the person and does not go beyond. So like the followers of Gandhi & now YSR, I wonder whether we keep praising Sirivennela without taking his ideas and message forward.

    So I constantly caution myself to be detached and try to view things in the most objective way possible (Again, as you know perfect objectivity doesn’t exist. We are biased and our views are always subjective). Hence even though I am a great admirer of Sirivennela I disagreed with him many times – like when he said movies can not spoil people or that Hindi lyrics have no poetry or that his song “ilaa enta sepu ninnu chuusinaa” from the movie Sasi Rekhaa parinayam is the greatest lyric in the world!

    ———————————————————

    good to know you aware this and not interested take it granted every thing.yup this is what i tried to say .

    nenu matram cinimalu spoil cheyyalevu leda bagu kooda cheyyalevu chala varaku ani nammuthanu …so for that matter sirivennela work kooda kontha varaku like minded ppl ni kalapadaniki use avuthundi …migatha lyricysts ki kooda idi varthistundi ..anthe …ani naa bhaavam…and its just personal thought on what i have come through so faar…

    teliyanidi cheppina ardham kaadu ani logic meeku nachithe, samajaniki teliyanidi cinimalo cheppina mari ardham kaadu kadaaa….idi sirivennela bhaavam kaavachu… nenu matram yee manchi/chedu movie choosi ippatiki maaraledu ( temporary ga try chesina, avvanni trash la prove ayyai kooda 😛 ) …inka vere examples avasaramaa 🙂 ..

  11. panilo paniga meeru akkada refer chesina post jagamantha kutumbam pai vimarsa koodaa choosaa…hammmayyya…ippatiki santhinchaaa 🙂 …..

    papam sirivennela anthaa telisi vaddu vaddu annaaa krishna vamsi cinima teesi , sirivennela paruvu teesaru ( ardham cheppalsi vachindi kadaa…lekapothe yedo naa istam raasukonna …yevaro cinimalo pettukonnaru nenem chestanu ante inkonchem decent ga undedi)

    ,,,pandithulu alaa decent ga criticize chesaru ..mari nenu paamara poppulation kaabatti ilaa chepthunna !

  12. sorry ekkada vrayalo telidu ..so using this space onlu …

    నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
    ఒంటరినై అనవరతం
    కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని,రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని
    జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది

    kotha pali(aayane kada criticise chesinadi) gaaru ikkada oka mistake chesaru

    ఒంటరినై అనవరతం
    కంటున్నాను నిరంతరం ni kalipi chadivaru….1st part ni previous lineki, next line ni tarvathi flow lo kalupukunte, ‘అనవరతం, నిరంతరం’ oke meaning ani vundadu …

    నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం

    కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని ..ilaa annamaata

    naa issue song tho kaadu sirivennela ichina explanation lo tane conflict ayyaru anukontanu…

    inkO review lo

    మల్లెల దారిలో… మంచు ఎడారిలో || 2 ||
    పన్నీటి జయగీతాలు కన్నీటి జలపాతాలు

    ki మల్లెల దారిలో పన్నీటి జయగీతాలు, and మంచు ఎడారిలో కన్నీటి జలపాతాలు ani bhaavam chepparu ….

    మంచు ఎడారిలో కన్నీటి జలపాతాలు …yeDari lo kanneru ravadame kastam, jalapathala ante???? ..adi mari manchu yedari kadaa vastayemole, ani sarduku poye tatvam naadi ….naku bhva kavithvam telidu kaabatti. same issues KBL lo song ki undavu ani naa viswasam.

    inka mee

    ఈ వాక్యాలకి అర్థం స్పష్టంగా ఉన్నా, కవి చెప్పాలనుకున్న అన్వయం అంత స్పష్టంగా లేదు. కాబట్టి మీ interpretation కూడా కరెక్టే, నేనూ కరెక్టే!

    so yedoO mee interpretation correctaa kaadaaa ani blind ga cheppatam ledu ..alaa ani 2 meanings undavu ..so evaridi varE 😛 …just naa opinion cheppanu. nene correct anukonte oka post vraseyyali kaani ikkada cheppanavasaram ledu ..

    ఈ వాక్యాలకి అర్థం స్పష్టంగా ఉన్నా, కవి చెప్పాలనుకున్న అన్వయం అంత స్పష్టంగా లేదు

    anvayam anedi mee experiences ni bati, mee understandig level ni batti clarity vastundi ….inka nenu 2,3 times you tube vedio choosanu …anvayam akkadi scenes tho ledu(veelayinantha varaku justify chesaru) ..situation tho undi ..

    kavi chala clear ga chepparu ani nenu bhavistunnanu…mee anvayam lo ne clarity tagginadi meeku ardhamu ayinaa koodaa…

Leave a reply to manikya స్పందనను రద్దుచేయి