గతంలో “ఆవకాయ్-బిర్యాని” తినిపించిన సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి ఈ సారి తన సంగీత రసామృతాన్ని అందించారు “విలేజ్ లో వినాయకుడు” చిత్రంలో. ఈ చిత్రంలో పాటలన్నీ వనమాలి రాశారు. దర్శక (సాయి కిరణ్ అడివి) నిర్మాతల ఉన్నతమైన అభిరుచి ఈ ఆడియోలో కనిపిస్తుంది.
1. చినుకై వరదై
ఈ పాట వింటే చాలా కాలం తర్వాత ఒక చక్కని యుగళ గీతం, ప్రేమ గీతం విన్న భావన కలుగుతుంది. మంచి మెలొడీ ఇస్తూనే foot tapping number గా మలచడంలో సంగీత దర్శకుడు పూర్తిగా సఫలీకృతుడయ్యాడు. ఈ మధ్య అంతగా వినిపించని హరిహరన్ గొంతు మథురంగా ఈ పాటలో వింటాం.
సాహిత్య పరంగా వనమాలి ఎంత బాగో రాశారో తెలియలాంటే మచ్చుకి ఒక భావం –
తడి లేని నీరున్నదేమో
సడి లేని యద ఉన్నదేమో
నువు లేక నేనున్న క్షణమున్నదా?
ఈ పాట సాహిత్యంలో వినిపించే “విధిని ఎదిరించడం”, “అనుకోని మలుపు” లాటివి చూస్తే సినిమా సందర్భాన్నీ, కథనీ కూడా వనమాలి కొంత ఈ పాటలో స్పృశించారు అనిపిస్తుంది.
2. అహ నా పెళ్ళియంట!
మయాబజార్ లోని “అహ నా పెళ్ళియంట” పాట పల్లవిని, ట్యూన్ నీ తీసుకుని దాని చుట్టూ ఒక rap గీతాన్ని పొదిగిన వెరైటీ పాట ఇది. ఇందులో female voice (సౌమ్య) పాత మాయబజార్ పాట గొంతులానే అనిపించడం ఇంకో తమషా. సాహిత్యంలో కూడా
నీకు మూడు ముళ్ళంట, లోకమంత థ్రిల్లంట !
అంటూ కొంత modern touch కనిపిస్తుంది. మొత్తానికి ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అనిపించింది.
3. నీలి మేఘమా
ఇదో అద్భుతమైన solo song. ఎంతో melodious గా, హాయిగా విన్న మొదటిసారే గుండెలకి హత్తుకుంటుంది. ట్యూనూ, పాటలో వినిపించే కోరస్ ఆకట్టుకునేలా ఉన్నాయ్. కార్తీక్ చాలా బాగా పాడాడు. సాహిత్యపరంగా ఒక భావ గీతంలా మలిచారు వనమాలి.
ఆ ఏటిగట్టు అల పాదాల తోటి
ఈ గుండె తడిమి తడిగురుతు చూపుతోంది
లాటి చక్కటి భావాలు ఉన్నాయ్. సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే సినిమాలో కథానాయకుడు పల్లెటూరు వచ్చి అక్కడి హీరోయిన్ కుటుంబంతో అనుబంధం ఏర్పరచుకుంటాడు అనిపిస్తుంది.
4. తీసే ప్రతి శ్వాస
సందర్భోచితంగా సాగుతున్న ఈ చిత్ర గీతాలలో ఒక శోక గీతం ఉండి తీరాలని ఊహించడం పెద్ద కష్టం కాదు. అదే ఇది. శోక గీతాన్నీ జనరంజకంగా మలచడంలో సంగీత దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు అనిపిస్తుంది. హరిహరన్ చక్కగా పాడిన ఈ పాటకి వనమాలి తగిన సాహిత్యాని అందించారు.
5. సూపర్మేన్ బ్రదర్ ని
“సూపర్మేన్ బ్రదర్‌నీ, స్పైడర్మేన్ కజిన్‌నీ” అంటూ trendy గా సాగే ఈ పాట సాహిత్యం వనమాలి లో ఇంకో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. బహుశా హీరో పిల్లల దగ్గర పాడే పాట కావొచ్చు ఇది. సంగీతం, గానం తగ్గట్టుగా ఉన్నాయ్. అయితే హోరు కొంత ఎక్కువై సాహిత్యం స్పష్టంగా వినిపించకపోవడం ఈ పాటలో ఒక లోపం అనిపించింది.
ఇవి కాక violin తో వినసొంపుగా వింపించే theme music ఈ ఆల్బంకి ప్రత్యేక ఆకర్షణ. “ముద్దుగారే యశోద” అన్నమయ్య గీతం కూడా రెండు సార్లు male and female voices లో వినిపించి రంజింపజేస్తుంది. ఈ గీతాన్ని కూడా సందర్భోచితంగా వాడి ఉంటారని భావించవచ్చు.
ఒక గొప్ప సంగీత సాహిత్య అనుభవం కావాలంటే ఈ ఆల్బం తప్పక వినండి – రాగలహరి
hi phanindra,
review bagundi, vinalsinde idi chadivaka, maa annamayya pata kuda undi kada 🙂
evaro arava atanu padinattu unnadu muddugare, amtanimta daggara amdanimda antunnadu.
-sravan
Sravan,
Thanks for the comments! Not sure about the singer of “muddugaare yashoda”. evaro kotta singer. barring these pronunciation mistakes, I think both the female and male versions are pretty decently executed. what do you say?
నాకు కూడా ఈ పాటలు నచ్చాయి, కృష్ణకు వరదలొచ్చే ముందే తెలుగు సినిమాకు వచ్చాయి. దాదాపు వారం రోజుల వ్యవధిలో ఎనిమిది సినిమా పాటలు విడుదల అయ్యాయి అందులో ఇదొకటి. మణికాంత్ ముందు సినిమాలైన ఆవకాయ, గమ్యం గుర్తుకొచ్చి ఈ పాటలు కూడా బాగుంటాయనుకున్నా, అనుకున్నట్టే జరిగింది.
ముద్దుగారే యశోద మగ గొంతు సూరజ్ అనుకుంట, రెండు గొంతులు బాగున్నయ్.
కాని నా స్నేహితులలో కొంతమందికి ఈ పాటలు నచ్చలేదు.
అందరికీ నచ్చే పాటలు ఎక్కువ ఉండవు! ఆల్బం మొత్తం మెలొడీ గీతాలే అయితే కొందరికి నచ్చకపోవడం సహజమే. BTW, మణికాంత్ కద్రి రెండో సినిమా ఇదే, నాకు తెలిసి. అంతకు ముందుది ఆవకాయ్ బిర్యాని. గమ్యం సంగీత దర్శకుడు ఈయన కాదు.
అవును నేను పొరబడ్డాను గమ్యం సినిమాకి ఈ.ఎస్. మూర్తి.
అబ్బ ఛా!
bagundi mee review. chaduvuthuntene vineyyalani thega utsahamga unnadi. office lo speakers leni kaaranamga ipudu chinthisthunna rathriki vinagalanu ane asa thoti excited ga unna. repu chepthanu vinesi naa abhiprayam kuda. 🙂
Nice Review..!!! I am going to listen
very good review