గలగలగల గంగోత్రి పాట గురించి వేటూరి

గంగోత్రి సినిమాలో వేటూరి రాసిన “గలగలగల గంగోత్రి” పాటని తలచుకుంటే కొన్ని సంగతులు గుర్తుకు వస్తాయి. అప్పట్లో idlebrain.com సైట్లో శ్రేయ అన్నావిడ(?) ఆడియో రివ్యూస్ రాస్తూ ఉండేవారు. సిరివెన్నెలపై అభిమానం, వేటూరిపై దురభిమానం తనకి ఉందని చాలా పోస్టుల్లో నాకు అనిపించేది. నాకు ఈ వివక్ష నచ్చేది కాదు. అలాంటి ఆవిడే ఈ పాట గురించి – the veteran did a good job అని పొగడ్డం నాకు ఆనందాన్నిచ్చింది. హాసం రాజా ఈ పాట గురించి రాస్తూ – “వేటూరి ఈ పాటకి వాడిన భాష చూస్తే కన్నీటితో ఆయన పాదాలు కడగాలనిపిస్తుంది” అన్నారు. అప్పట్లోనే వార్త దినపత్రికలో వి.ఎ.కె రంగారావు గారు “ఆలాపన” అనే శీర్షిక నిర్వహిస్తూ ఉండేవారు. ఒక పాఠకుడు – “వేటూరి గంగని గంగోత్రని సంబోధించి తప్పులు రాశాడు” అంటే రంగారావుగారు – “అవును ఆయనకి అలవాటేగా! కలకత్తా గురించి “యమహానగరి” పాటలో తప్పులు చేసినట్టే ఇక్కడా” అని అక్కసుతో అన్నారు. పాటలో మిగతా మంచి వదిలేసి, ఏదో సినిమా సౌలభ్యం కోసం చేసిన మార్పుకి ఇంత రామాయణంలో పిడకలవేట అవసరమా అని నాకనిపిస్తుంది.ఏదేమైనా ఇది గొప్ప పాటేనని ఒప్పుకుని తీరాలి. కీరవాణి చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. గమనిస్తే ఈ పాటలో ఒక పల్లవి, రెండు చరణాల standard structure లేదని తెలుస్తుంది. గంగానది లాగే ఒక free flow లో ఈ పాట దర్శనమిస్తుంది. ఈ పాట రచన గురించి వేటూరి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇక్కడ చదవండి: గలగలగల గంగోత్రి

సౌలభ్యం కోసం ఈ పాట పూర్తి సాహిత్యం కింద ఇస్తున్నాను:

సాకీ:
జీవనవాహినీ పావనీ
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముతీర్చి శుభముకూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనీ
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి

పల్లవి:
గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి

పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో
శ్రీగంధపు  ధారతో
పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం

చరణం 1:
మంచు కొండలో ఒక కొండవాగుగా
ఇల జననమొందిన విరజావాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

అమ్మా  గంగమ్మా
కృష్ణమ్మకి చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని…
యమునకి చెప్పమ్మా
సాయమునకి వెనకాడొద్దని…
గోదారికి కావేరికి
ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి
దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా మా గంగమ్మా

చరణం 2:
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లుపూలుపసుపుల పారాణిరాణిగా
శివునిజటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

రచయిత: Phanindra

I am an engineer by profession and a hobbyist writer. My literary interest started with analyzing lyrics of Telugu movie songs and I love Telugu lyricists Veturi and Sirivennela. I tried my hand at writing songs, poems and stories in Telugu. I also have an interest in spirituality/philosophy, self-help and management.

8 thoughts on “గలగలగల గంగోత్రి పాట గురించి వేటూరి”

 1. ఆ మధ్యన 2007లో ఇండియా ప్రపంచ-కప్ ఓడిపోయినప్పుడు సచిన్ అభిమానులెందరో అతడికి వ్యతిరేకులయ్యారు. అవసరమున్నప్పుడు ఆడడని ప్రచారం మొదలెట్టారు. వాళ్ళను చూస్తే నాకు జాలి వేసేది. సాధారణంగా సచిన్ దురభిమానుల్లో ఈ రెండింటిలో ఏదో ఒక సమస్య ఉండేది అని నా అభిప్రాయం:

  1. తమకు సచిన్ కి ఉన్న నైపుణ్యం అంటే విపరీతమైన అభిమానం. సచిన్ ఓడిపోవటం వాళ్ళు సహించలేకపోయేవారు. ఓడిపోయిన కోడిని కూర వండుకుని తిన్నట్టు, వాళ్ళ ఆశలను నిజం చెయ్యలేకపోయిన సచిన్ ని నిందించి వాళ్ళ అక్కసు తీర్చుకునేవారు.

  2. సచిన్ కి ఉన్న నైపుణ్యం వాళ్ళకు/వాళ్ళ అభిమాన batsman కు లేదని, సచిన్ ఉత్తమ batsman అని అందరూ అనడం వాళ్ళ egoకి దెబ్బ తగుల్తూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు సచిన్ ఉత్తముడు కాదు అని నిరూపించాలని వాళ్ళ తాపత్రయం. అది జరిగితే ఎంతో మంది సచిన్ అభిమానులని ఓడించిన తృప్తి ఉంటుంది. అది సచిన్ ని ఓడించనట్టుగా భావించుకుంటారు. అమాయకులు.

  ఇదే వేటూరి విషయంలో కూడా నిజం. తాము నిజమైన విమర్శకులం అని, వేటూరి చేసిన తప్పులు తమకే తెలుసునని అనుకునేవాళ్ళకు ఎంతో కొంత ego problem ఉంటుంది అని నా అభిప్రాయం. అలాగే, వేటూరి తాము అనుకున్నట్టుగా వ్యవహరించట్లేదు అనే అక్కసు ఉంటుంది అని నా అభిప్రాయం. వేటూరి యే వాక్యం ఎందుకు వ్రాశారో శతాబ్దాలనాటి పుస్తకాలు తిరగేసి చెప్తుంటే వీళ్ళందరూ ముక్కున వేలేసుకుంటారు. ఆయనకు ఆ అవసరం లేకపోయింది, ఈ విమర్శకులకు సాహిత్యం మీద ఆసక్తి విమర్శల తో పొందే దుష్టానందం ఎక్కువ.

 2. మంచి పాటని గుర్తుచేశావ్, సోదరా.
  అంతేకాకుండా ఈ పాటపై వేటూరి గారు రాసిన Article ని పోస్ట్ చేశావ్. నెనర్లు.

  సందీప్ అన్న మాటలతో నేను ఏకీభవిస్తాను.

  1. అనుపమా, నీ కామెంటుకి థాంక్స్! ఆసక్తికరమైన విషయం తెలిపావు. కీరవాణి అలా
   చెప్పిన ఆ ప్రోగ్రాం ఏమిటి, యూట్యూబ్ లింక్ ఉంటే ఇవ్వు!

   వేటూరి తన వ్యాసంలో “జీవనదివిగా” అన్న చరణం కూడా తను రాసినట్టే పేర్కొన్నారు.
   “జలదీవెన” అన్న దుష్టసమాసం గురించి ప్రస్తావించారు కూడా. జొన్నవిత్తుల వారికీ
   వేటూరికీ మంచి అనుబంధం ఉంది కాబట్టి మరి ఆయన కంట్రిబ్యూట్ చేసినా చేసుండొచ్చు!

   On Fri Jan 09 2015 at 3:33:12 PM "తెర"చాటు చందమామ wrote:

   >

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: