ఈ బ్లాగు గురించి

“సినిమా పాటల్లో సాహిత్యం, కవిత్వం ఏమిటి?” అని ప్రశ్నించే వాళ్ళకి ధీటుగా జవాబిచ్చే ఎన్నో పాటలు మనకున్నాయి. సముద్రాల, పింగళి, సినారె, దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, సిరివెన్నెల … ఇలా ఎందరో కవులు గొప్ప పాటలు రాశారు. ఇలాంటి చక్కని పాటలు వింటున్నప్పుడు నాలో కలిగిన స్పందనకి అక్షరరూపమే ఈ బ్లాగ్.

“ఓహో…అయితే ఇదొక Telugu lyrics బ్లాగా” అనేసుకోకండి! కాదు. ఎందుకంటే ఇక్కడ పాటలో సంగీతం కంటే సాహిత్యానికే అగ్రతాంబూలం. అంటే tune, music తీసేసినా నిలబడగలిగే ఉత్తమ సాహిత్యమే ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు పాటని చదవడానికి రావాలి, పాడుకోడానికి కాదు!

మన సినిమాల్లో ఎప్పుడూ సంగీతమే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కాబట్టి సినిమా ఆడియో హిట్ కాకుంటే అసలు సాహిత్యం ఎలా ఉన్నా కనుమరుగైపోయే పాటలే ఎక్కువ. పైగా, అసలు సినిమాయే flop అయితే ఇక పాటలు చాలా సార్లు సమాధి అయిపోయినట్టే. కాబట్టి అంతగా పేరుగాంచని గొప్ప సాహిత్యాన్ని ఇక్కడ పెట్టే ప్రయత్నం జరిగింది.

నేను విన్న పాటలు ఎక్కువ వేటూరివి, సిరివెన్నెలవే కనుక వారి పాటలే ఇక్కడ ఎక్కువ కనిపించొచ్చు.

ఇక నాకు తెలుగు భాషపై కానీ, కవిత్వం, సాహిత్యం లాంటి విషయాల్లో గానీ కేవలం ఆసక్తే తప్పించి పాండిత్యం లేదు కాబట్టి నేను రాసిన వాటిల్లో తప్పులు ఉండే ఉంటాయి. తెలిసిన వాళ్ళు సరిజేస్తే ధన్యుడను.

ప్రకటనలు

13 thoughts on “ఈ బ్లాగు గురించి”

 1. ఫణీంద్రగారు, మీ గురించి మీరు చెప్పుకున్న విధంలోని స్పష్టత నాకు నచ్చింది. మీ అభిరుచి ఈ బ్లాగురూపందాల్చడం మాకెంతో ఆనందకరం. ఇకనుంచి, ఈ గూటికి తరచూవచ్చేవాళ్లలో నేనూ ఒకడిని.

 2. చాలా బాగుంది మీ ఉద్దెశ్యం. రంగేళి పాట సాహిత్యం చాలా బాగుంది. ఇప్పుడే సిరివెన్నెలగారి జెమినీ టీవీ ఇంటర్వ్యూ చూసి మీ బ్లాగు చూసా. అందుకని ఇంకా బాగా ఆనందించా. జగమంత పాటకి సాహిత్యం పెట్టగలరా?

 3. Dear Phaneendra garu,
  Chaala santoshanga vundi.intavaraku epudu mee blog choodaledu.Meeru enchukunna vishayam chaala chaala baagundi.chadivina taruvaata naalo vunna kavi aasaantam accheruvondaadu, aanandapaddadu, ilanti saahitya vedika chaala avasaram ani kooda annadu.Dayachesi mee mail id pampinchara, please.meeto matladaaalani vundi………
  aamanai kai koila,niseedhi kai vennela,nenoooooo mee mail kosam vechi vuntaanilaaa……..

  Itlu,
  siva prasad.Nama
  Design Engineer
  I2T2 India LTD,Hyderabad.
  Mail:sprasad.nama@gmail.com
  Mobile:9440328653

 4. మీ రాసిన విషయం, శైలి ఎంతో బాగున్నాయి. చివరిగా డిసెంబర్ 31 న రాశారు.అందులో వ్యాఖ్యలు చేసే వీలు లేకుండా ఎందుకు చేశారు? మీరు మళ్ళీ ఎందుకు రాయలేదు? దయచేసి రాయడం మానివేయకండి.

 5. నా పేరు రవి , మీ బ్లొగ్ ని చూసాను చాల బగుంధి, నేను సిరివెన్నల గారికి aబిమానిని , మీకు తెలిస్తె నా సంధెహం వివరించ గలరు.
  ఎందుకు గురువు గారు ఈ మధ్య అంతగ పాటలు రాయటుం లేధు, ఖలెజ సినీమాకి , రక్థ చరిత్ర కి గురువుగారు తప్పకుండ రస్తారు అనుకున్న, మీకు యేమిన తెలుసా ?

 6. ఫణీంద్ర గారు.. నేను మీ బ్లాగ్ ని కొద్దికాలంగా చూస్తున్నాను.నాకు చాలా బాగా నచ్చింది. వేటూరి ఇష్టమా-సిరివెన్నెల ఇష్టమా అంటే.. ఏ కన్ను ఇష్టం అని అడిగినట్లు ఉంటుంది. .. తెలుగు పాటల్లో..సాహిత్యపు విలువలా? అని వెక్కిరించే వారికి.. వీరు ఇరువురు సమాధానం. వేటూరి గారి సాహిత్యం పై..పి.హిచ్.డి..చేయాలనుకున్న కోరిక కోరికగా మిగిలి పోయింది. జయంతి చక్రవర్తి గారి అదృష్టం దక్కింది.
  మీ బ్లాగ్ నాకు అపురూపంగా తోస్తుంది. చాలా చక్కని అభిరుచి. నా బ్లాగ్ కూడా చూడండి.. నా బ్లాగ్లో..పాటల తోటమాలి,సిరివెన్నెల శోభ చూడండి.
  మీకు చక్కని బ్లాగ్ నిర్వహిస్తున్నందుకు ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s